పోలీస్ ఇన్స్ పెక్టర్ సోదరి లవ్ స్టోరి: అపార్ట్ మెంట్ నుంచి పడి తల్లీ, కొడుకు దుర్మరణం!
బెంగళూరు: బెంగళూరులో తల్లీ, కుమారుడు అపార్ట్ మీద నుంచి పడి అనుమానాస్పదస్థితిలో దుర్మరణం చెందారు. ఎక్కడో ఉన్న తల్లీ, కుమారుడు పోలీస్ ఇన్స్ పెక్టర్ సోదరి ప్రేమ వివాదం విషయంలో బెంగళూరు వచ్చి అదే పోలీసు అధికారి అపార్ట్ మెంట్ మీద నుంచి కిందపడి అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు.

పోలీసు అధికారి
బెంగళూరులో పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమం ఉన్న కాడుగోడిలోని పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ గా చంద్రప్ప పని చేస్తున్నారు. కర్ణాటకలోని యాదగిరికి చెందిన మౌనేష్ కేఎస్ఆర్ టీసీ లో బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ చంద్రప్ప సోదరి, మౌనేష్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

లేచిపోయిన ప్రేమికులు
కాడుగోడి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ చంద్రప్ప సోదరి ఇంటి నుంచి పారిపోయి కేఎస్ఆర్ టీసీ బస్సు డ్రైవర్ మౌనేష్ కలిసి నివాసం ఉండేది. తరువాత చంద్రప్ప తన పోలీసు పవర్ తో మూడుసార్లు ప్రియుడు మౌనేష్ తో పారిపోయిన సోదరిని మళ్లీ ఇంటికి పిలుచుకుని వచ్చాడు.

డ్రైవర్ తో ప్రేమ
కాడుగోడి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ చంద్రప్ప కేవలం ఒక డ్రైవర్ తో నీకు ప్రేమ ఏమిటని తన సోదరిని గట్టిగా మందలించాడని తెలిసింది. అయితే తాను మౌనేష్ నే పెళ్లి చేసుకుంటానని, ఇంటిలో చూసిన సంబంధం చేసుకోనని ఆమె చెప్పిందని తెలిసింది.

పోలీసు పవర్
పోలీసు అధికారి అయిన చంద్రప్ప నాలుగు రోజుల క్రితం యాదగిరి నుంచి మౌనేష్ (36), ఆయన తల్లి సుందరమ్మ (55)ను బెంగళూరు తీసుకు వచ్చాడు. కాడుగోడిలోని బెళ్తూరిలోని చంద్రప్పకు చెందిన అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో తల్లీ, కుమారుడిని నిర్బంధించాడని తెలిసింది.

తల్లీ, కొడుకు ఒకే సారి
మంగళవారం ఉదయం పోలీస్ ఇన్స్ పెక్టర్ చంద్రప్పకు చెందిన అపార్ట్ మెంట్ మీద నుంచి సుందరమ్మ, ఆమె కుమారుడు మౌనేష్ కిందపడి అనుమానాస్పదస్థితిలో దుర్మరణం చెందారు. సుందరమ్మ, మౌనేష్ ఆత్మహత్య చేసుకున్నారా ? ఇద్దరినీ హత్య చేశారా ? అని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇన్స్ పెక్టర్ బదిలి !
ఇటీవలే కాడుగోడి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్ పెక్టర్ చంద్రప్పను బదిలి చేశామని పై అధికారులు అంటున్నారు. అసలు చంద్రప్ప తన సోదరి ప్రియుడు మౌనేష్, ఆమె తల్లి సుందరమ్మను ఎందుకు తీసుకువచ్చి అపార్ట్ మెంట్ లో నిర్బంధించారు ? వారు ఎందుకు అనుమానాస్పదస్థితిలో దుర్మరణం చెందారు అని పై అధికారులు ఆరా తీస్తున్నారు.

హత్య చేశారా ?
పోలీస్ ఇన్స్ పెక్టర్ చంద్రప్పకు తన సోదరిని కేఎస్ఆర్ టీసీ డ్రైవర్ మౌనేష్ కు ఇచ్చి వివాహం చెయ్యడం మొదటి నుంచి ఇష్టం లేదని తెలిసింది. ఇంటి నుంచి మూడుసార్లు మౌనేష్ తో పారిపోయిన సోదరిని చంద్రప్ప బలవంతంగా ఇంటికి తీసుకువచ్చాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. పోలీసు అధికారులు తల్లీ, కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసును పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications