నిత్యానంద స్వామి అక్రమాలు?, అమ్మాయిల నగ్న వీడియోలతో వాట్సాప్ గ్రూప్, పోర్న్ వీడియోలు, శర్మా!
అహమ్మదాబాద్/బెంగళూరు: వివాదాల స్వామీజి నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద అరాచకాలు, అక్రమాలు ఎక్కువ అయ్యాయని, ఆయన నిర్బంధంలో ఉన్న తన ఇద్దరు కుమార్తెలతో పాటు 12 మంది మైనర్ అమ్మాయిలను క్షేమంగా రక్షించాలని బెంగళూరు నగరానికి చెందిన జనార్దన్ శర్మా గుజరాత్ హైకోర్టుకు మనవి చేశారు. నిత్యానందకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉందని, అమ్మాయిల నగ్న చిత్రాలను ఆ వాట్సాప్ గ్రూప్ కు పంపించాలని వారి మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఆ వాట్సాప్ గ్రూప్ కంటే పోర్న్ వీడియోలు నయం అని, వారి అరచకాలకు తన కుమార్తెలతో పాటు అనేక మంది అమ్మాయిలు బలి అవుతున్నారని జనార్దన్ శర్మా ఆరోపిస్తున్నారు.

నా కుమార్తెలను రక్షించండి
తన ఇద్దరు కుమార్తెలను అహమ్మదాబాద్ లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించారని, వారిని క్షేమంగా రక్షించి తమకు అప్పగించాలని బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మా గుజరాత్ హై కోర్టును ఆశ్రయించారు. తన ఇద్దరు కుమార్తెలతో పాటు అనేక మంది మైనర్ అమ్మాయిలను నిత్యానంద ఆయన ఆశ్రమంలో నిర్బంధించారని జనార్దన్ శర్మా ఆరోపించడంతో అహమ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అక్కడి నిత్యానంద ఆశ్రమాన్నిసీజ్ చేశారు.

ఆ ఇద్దరే కారణం
నిత్యానంద ప్రధాన అనుచరులైన కాలోర్క్స్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఇవో మంజుల పూజ, ఉవా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ షా తదితరులు కలిసి తన ఇద్దరు కుమార్తెలను తనకు కాకుండా చేశారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని జనార్దన్ శర్మా గుజరాత్ హైకోర్టులో మనవి చేశారు.

నిత్యానందకు ప్రియమైన మహిళా శిష్యులు
నిత్యానంద చెప్పినట్లు ఆడుతున్న ఆయన ప్రియమైన శిష్యురాళ్లు మా ప్రాణప్రియ, మా ప్రియతత్వకు బెయిల్ ఇవ్వరాదని జనార్దన్ శర్మా గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయస్థానంలో మనవి చేశారు. నిత్యానంద ఆశ్రమంలో అక్రమాలు జరగడానికి మా ప్రియతత్వ, మా పాణప్రియ కూడా కారణం అయ్యారని జనార్దన్ శర్మా ఆరోపిస్తున్నారు.

ఆశ్రమంలో రుద్రకన్యలు
తన ఆశ్రమంలో ఉంటున్న అమ్మాయిలు, మహిళలను నిత్యానంద రుద్రకన్యలు అని పిలుస్తుంటాడని, నిధులు సేకరించడానికి వారిని ఉపయోగించుకుంటున్నాడని జనార్దన్ శర్మా ఆరోపించారు. నిత్యానంద తన అక్రమాలు కొనసాగించడానికి ఎంతకైనా తెగిస్తాడని జనార్దన్ శర్మా ఆరోపించారు.

రాత్రికి గదిలోకి రావాలి, నగ్న ఫోటోలు పంపించాలి!
ఆశ్రమంలో ఉంటున్న అమ్మాయిలు, మహిళలను రాత్రి తన గదిలోకి రావాలని నిత్యానంద వారిని ఆహ్వానిస్తాడని, అంతే కాకుండా మీరు నగ్నంగా ఉంటున్న సమయంలో తీసిన ఫోటోలు తన వాట్సాప్ గ్రూప్ కుం పంపించాలని నిత్యానంద వారి మీద ఒత్తిడి చేసేవాడని జనార్దన్ శర్మా ఆరోపించారు. అమ్మాయిల నగ్న ఫోటోలతో నిత్యానంద ఓ పోర్న్ వాట్సాప్ గ్రాప్ నిర్వహిస్తున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని జనార్దన్ శర్మా గుజరాత్ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications