ప్రేమికులకు శుభాకాంక్షలు చెప్పిన నిత్యానంద స్వామి, శివరాత్రికి లింక్, భాయ్స్ రోజా పూలు విసరండి !
Recommended Video
బెంగళూరు: నేను దైవ మానువుడు అంటూ స్వయంగా ప్రకటించుకన్న వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రేమికుల రోజు నిత్యానంద ప్రేమికులకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమికుల రోజు సందర్బంగా నిత్యానంద స్వామి శుభాకాంక్షలు చెబుతున్న వీడియోలో ఆయన ప్రేమికుల రోజుకు అతి దగ్గరలో శివరాత్రి పండుగ ఉందని, ఈ రెండు పండుగలు మీరు సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. అయితే ప్రేమికుల రోజుకు, శివరాత్రికి లింక్ ఏమిటిలో అర్థం కాక ప్రజలు, నిత్యానంద భక్తులు అయోమయానికి గురైనారు. ప్రేమికుల రోజు భాయ్స్ వీలైనంత వరకు ప్రతి కార్నర్ లో రోజా పూలు విసరాలని, అదే ప్రేమికుల రోజు అంటూ నిత్యానంద పకపక నవ్వారు.

ప్రేమికుల రోజు
ఫిబ్రవరి 14వ తేదీ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రేమికులకు ఈ రోజు అసలైన పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు ఎంతో వైవిధ్యంగా, సంతోషంగా జరుపుకుంటారు. ఎవరికి తోచినట్లు వారు ఫిబ్రవరి 14వ తేదీ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది.

నిత్యానంద ఎక్కడ ?
మైనర్ అమ్మాయిలను నిర్బంధించారని, వారిని ఆశ్రమం నుంచి బయటకు రానివ్వడం లేదని ఆరోపణలు రావడం, గుజరాత్ పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో నిత్యానంద మాయం అయ్యారు. నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి నిత్యానంద భారత్ విడిచి విదేశాలకు పారిపోయారని ప్రచారం జరిగింది.

కైలాస దేశంలో నిత్యానంద ?
ప్రస్తుతం నిత్యానంద ఈక్విడార్ లో ఓ ద్వీపం కొనుగోలు చేసి అక్కడ కైలాస దేశం ఏర్పాటు చేసుకుని అక్కడే శిష్యులతో కలిసి నివాసం ఉంటున్నారని ఇటీవల విడుదలైన వీడియోలో వెలుగు చూసింది. నిత్యానంద ఎక్కడ ఉన్నారో ? అనే విషయంపై గుజరాత్ పోలీసులతో పాటు బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయంతో భారత్ పోలీసులు నిత్యానంద ఆచూకి కోసం వేల ప్రారంభించారు.

ప్రేమికులకు శుభాకాంక్షలు
పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్న సమయంలో ఏదో ఒక రకంగా నిత్యానంద ఆయన శిష్యులకు వీడియో సందేశం పంపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్బంగా కేవలం 24 సెకన్లు ఉన్న ఓ వీడియో విడుదలైయ్యింది. గులాబీ పూలతో ప్రేమికులు హాయిగా ప్రేమికుల దినోత్సం జరుపుకోవాలని నిత్యానంద ప్రేమికులకు, ఆయన శిష్యులకు ఉపన్యాసం ఇచ్చారు.
అబ్బాయిలు (భాయ్స్) రోజా పూలు తీసుకుని వీలైనన్ని చోట్ల విసరాలని, అదే ప్రేమికుల రోజు ప్రత్యేకత అంటూ నిత్యానంద పకపకా నవ్వారు.
ప్రేమికుల రోజుకు శివరాత్రి లింక్ !
నిత్యానంద స్వామి భక్తులు విడుదల చేసిన వీడియోలో విచిత్రమైన ఓ సందేశం ఉంది. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పిన నిత్యానంద ఈ రోజు (శుక్రవారం) ప్రేమికుల రోజు, త్వరలో (వచ్చే శుక్రవారం) శివరాత్రి, ఈ రెండు పండగలు మీరు సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను, రోజా పూలు ప్రతి కార్నర్ లో విసరండి అదే ప్రేమికుల రోజు ప్రత్యేకత అంటూ నిత్యానంద వీడియోలో పకపక అని నవ్వుతున్నారు. ప్రస్తుతం నిత్యానంద విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రేమికుల రోజుకు, శివరాత్రికి లింక్ ఏమిటో బెంగళూరు శివార్లలోని బిడిది ఆశ్రమంలో ఉంటున్న ఆయన శిష్యులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications