కేజ్రీవాల్‌కు రాని పిలుపు, రేపు ప్రమాణ స్వీకారం డౌట్

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గురువారం ఉండకపోవచ్చునని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు విషయమై తాము లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ ఇచ్చామని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ నుండి పిలుపు రానందున రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోవచ్చునని తెలిపారు. తమ పార్టీలోని ఎమ్మెల్యేలంతా సంతృప్తితోనే ఉన్నారన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేజ్రీవాల్ చెప్పారు.

 Swearing in ceremony on Thursday unlikely

ప్రమాణ స్వీకారానికి తేది ఖరారయ్యాక తాను సామాజికవేత్త అన్నా హజారేను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెసు మద్దతు పైన ఆ పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.

మద్దతివ్వాలా వద్దా అనేది ఆ పార్టీ ఇష్టమని, తొలుత వారు బేషరతు మద్దతు ఇస్తామని తెలిపారని చెప్పారు. తాము మాత్రం విషయ ప్రాధానంగా ప్రభుత్వం నడపాలనుకుంటున్నామని, ఎన్నికల ముందు చెప్పినట్లుగా తమ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసే విషయంపై పని ప్రారంభించామని చెప్పారు. మరోవైపు తాము కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపికి మద్దతిస్తామని కాంగ్రెసు చెబుతోంది. మద్దతిస్తామన్న తాము వెనక్కి తగ్గమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+