Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ బోగీ భస్మీపటలం

పంజాబ్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో నంబర్ 12204 అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. ఓ ఏసీ కోచ్ మొత్తం భస్మీపటలం అయింది. ప్రయాణికులు సకాలంలో మంటలను గుర్తించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికురాలు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటన ఈ ఉదయం 7.22 నిమిషాలకు చోటు చేసుకుంది. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సిర్హింద్ స్టేషన్ మీదుగా వెళ్తుండగా జీ-19 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ రైలుకు సిర్హింద్‌లో హాల్ట్ సౌకర్యం లేదు. ఈ రైలు తరువాతి హాల్ట్ స్టేషన్.. అంబాలా కంటోన్మెంట్‌. సిర్హింద్ స్టేషన్ దాటుకున్న కొద్దిసేపటికే ఈ ఏసీ కోచ్ మంటల బారినపడింది. తొలుత దట్టమైన పొగ వెలువడింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. చైన్ లాగి రైలును ఆపేశారు. కిందికి దిగారు.

Swift Action Train 12204 Amritsar-Saharsa Safely Detaches Affected Coach

ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ఫతేగఢ్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని జీఆర్పీ అధికారులు తెలిపారు. ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫతేగఢ్ సాహిబ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ లాల్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు. పేలుడు లేదా మండే స్వభావం ఉన్న వస్తువులు కోచ్ లో తరలిస్తోన్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు.

మంటలు అదుపు చేయడంలో భాగంగా అగ్ని ప్రమాదానికి గురైన కోచ్‌తో పాటు మరో మూడు బోగీలను రైలు నుండి వేరు చేశారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగి ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారు. మంటలను ఆర్పివేశారు. అప్పటికే బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కోచ్ అటెండెంట్ అమన్‌దీప్ సింగ్ సకాలంలో మంటలను గుర్తించి చైన్ లాగి రైలును ఆపివేశాడని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+