స్వైన్ ప్లూ: పరీక్షలు వాయిదా, యూనివర్సిటీకి సెలవులు
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో స్వైన్ ప్లూ బాగా విస్తరిస్తోంది. ప్రఖ్యాత అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థుల్లో స్వైన్‌ప్లూ లక్షణాలు బయటపడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 25 వరకు విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించారు.
స్వైన్ ప్లూ వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని మృతి చెందడంతో, మహిళా కాలేజీకి ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

అంతక ముందు ఆమెతో పాటు విహార యాత్రకు వెళ్లిన 187 మంది విద్యార్ధుల్లో ఏడుగురిలో స్వైన్ ప్లూ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో ఈ సంఖ్య మరింతగా పెరగడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు యూనివర్సిటీలో జరిగే అన్ని సమావేశాలు, మీటింగ్స్‌ను వాయిదా వేశారు.
లక్నోలో ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో 69 స్వైన్ ప్లూ కేసులను గుర్తించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ యాదవ్ తెలిపారు. ఆలీఘర్‌లో గత పదిరోజుల్లో స్వైన్‌ప్లూ బారినపడి ముగ్గురు మరణించినట్లు పేర్కొన్నారు.
రాజస్ధాన్‌లో 165 కు చేరిన స్వైన్ ప్లూ మృతుల సంఖ్య
రాజస్ధాన్‌లో స్వైన్ ప్లూతో మరణించిన వారి సంఖ్య తాజాగా 16కు చేరింది. నాగౌర్‌లో నలుగురు, జైపూర్, జోథ్ పూర్‌లో ఇద్దరు చొప్పున, సికర్, బికనీర్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. రాజస్ధాన్ రాష్ట్ర వ్యాప్తంగా 2569 మందికి H1N1 వైరస్ సోకినట్లుగా నిర్ధారించగా ఇప్పటి వరకు 165 మంది మరణించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications