ఎగ్ రైస్ కోసం వెళితే ప్రాణాలు పోయాయి, పై నుండి వాటర్ ట్యాంక్ లు !
బెంగళూరు/శివాజీనగర్: బెంగళూరు నగరంలోని శివాజీనగర్ బస్ స్టేషన్ వద్ద నాలుగు అంతస్తుల భవనంపై నుంచి వాటర్ ట్యాంక్, గోడ కూలి కింద ఎగ్ రైస్ విక్రయిస్తున్న బండి మీద పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
భవనం కింది ప్రాంతంలో ఎగ్ రైస్ తింటున్న వ్యక్తి అక్కడిక్కడే చనిపోవడంతో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలైనాయి.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో శివాజీనగర్ సమీపంలోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరు కూడా జీవన్మరణంతో పోరాడుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంన మీద సింటాక్స్ వాటర్ ట్యాంక్ పూర్తిగా నీటితో నిండిపోయింది. సింటెక్ ట్యాంక్ బరువుకు గోడ కుప్పకూలింది. గోడ మీద ఉన్న రెండు సింటెక్స్ ట్యాంకులు ఎగ్ రైస్ బండి మీద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇంతలో పక్కనే ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వెంటనే స్థానికుల సహాయంతో బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. శివాజీనగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన డీసీపీ భీమశంకర్ గులేద్ సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

శివాజీనగర్ బస్టాండ్ వద్ద ఓక్ ఫర్నీచర్ మీద ఉన్న ఓవర్ ట్యాంక్ కింద ఉన్న ఫుట్‌పాత్‌లో బండి మీద ఎగ్ రైస్ షాపు నడుతున్నారని. అదే ఎగ్ రైస్ బండి మీద వాటర్ ట్యాంక్ లు పడిపోయాయని డీసీపీ భీమాశంకర్ వివరించారు. ఈ ఘటనలో అరుల్ (40) మృతి చెందాడని, మరో వ్యక్తిని కమల్‌గా గుర్తించామని, మరో వ్యక్తి పేరు తెలియాల్సి ఉందని, ఆ వ్యక్తి సమాచారం ఇంకా లభ్యం కాలేదని, క్షతగాత్రులను బోరింగ్ ఆస్పత్రికి, విక్టోరియా ఆస్పత్రికి తరలించామని డీసీపీ భీమాశంకర్ తెలిపారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. భవనం మీద వాటర్ ఓవర్ ట్యాంక్ నిర్లక్షంగా ఏర్పాటు చెయ్యడం వలనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసిందని డీసీపీ వివరించారు. బీడీఏ అధికారులతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వివరించారు. బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎగ్ రైస్ కోసం వెళ్లిన వ్యక్తి, ఎగ్ రైస్ విక్రయిస్తున్న వ్యక్తి మీద సింటెక్ వాటర్ ట్యాంక్ లు కుప్పకూలిపోవడంతో ఇద్దరి ప్రాణాలు పోవడంతో బెంగళూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications