బండ్ల గణేష్ కొడుకు డ్యాన్స్ చూశారా..? ఇరగదీశాడుగా.. వీడియో వైరల్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లిబాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న ఉదయం 11 గంటల 58 నిమిషాలకు జరగనుంది. ఈ మేరకు పెళ్లి పనులు ఘనంగా మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు బండ్ల గణేష్. ఇక కుమార్తె జనని వివాహ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హితేష్ చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Viswanath & Sons First Review: ఆ ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది..!
Viswanath & Sons First Review: ఆ ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది..!

ఆద్యంతం సరదాగా సాగిన ఈ సంగీత్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోని టైటిల్ సాంగ్ కు బండ్ల హితేష్ డ్యాన్స్ స్టెప్పులతో అలరించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన హితేష్ ను చూసి అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు చప్పట్లతో ప్రోత్సహించారు. అలాగే సోదరి జనని సైతం తమ్ముడి డ్యాన్స్ చూసి ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేసింది. ఎన్టీఆర్ పాటలతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాటలకూ స్టెప్పులతో బండ్ల హితేష్ అదరగొట్టాడు.

ఈ క్రమంలో బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడిని జీవితంలో ఉన్నత స్థాయిలో చూడాలని ఎన్నో కలలు కన్నానని ఎమోషనల్ అయ్యారు. మూడు రోజుల క్రితమే డ్యాన్స్ చేయరా..? అని తన కుమారుడిని అడిగాడని.. ఇప్పుడు సంగీత్ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి సంతోషంగా అనిపిస్తోందని బండ్ల గణేష్ తెలిపారు. మొత్తానికి బండ్ల హితేష్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బండ్లన్న కుమారుడా..? మజాకా..? హితేష్ డ్యాన్స్ అదరగొట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ హితేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

BandlaGanesh Have you seen son Bandla Hitesh dance He absolutely nailed the video has gone viral

ఇక బండ్ల గణేష్ తన కుమార్తె జననికి సూర్య తేజ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో రీసెంట్ గానే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్' , 'గబ్బర్ సింగ్', రవితేజ తో 'ఆంజనేయులు', ఎన్టీఆర్ తో 'బాద్ షా' , 'టెంపర్', అల్లు అర్జున్ తో 'ఇద్దరు అమ్మాయిలతో', రామ్ చరణ్ తో 'గోవిందుడు అందరి వాడేలే' వంటి చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+