బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం: పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్!

భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1947 ఆగస్టు 11న బ్రిటీష్ పాలన నుంచి బలూచిస్తాన్ తన స్వాతంత్యాన్ని ప్రకటించుకుంది. నాటి సరిహద్దుల ప్రకారం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఉనికిలో లేని సమయంలోనే బలూచిస్తాన్ ఓ స్వతంత్ర ప్రాంతంగా ఉండేది. అయితే 1947 చివరలో పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను తన దేశంలో విలీనం చేసుకుంది. నాటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు తమ స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.

శత్రు దుర్భేద్యంగా పాక్ కూటమి..! త్వరలో మరో దేశం చేరిక..!
శత్రు దుర్భేద్యంగా పాక్ కూటమి..! త్వరలో మరో దేశం చేరిక..!

పాక్ అణచివేత.. చైనా జోక్యం
దశాబ్ధాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం బలూచిస్తాన్ ప్రాంతంపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. బలూచిస్తాన్ అపారమైన సహజ సంపదను కలిగి ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ దానిని ఓ రెండో తరగతి భూభాగంగానే చూస్తోంది. స్థానిక ప్రజల అనుమతి లేదా భాగస్వామ్యం లేకుండా పెద్ద ఎత్తున చైనా కంపెనీలను పెట్టుబడుల కోసం ఆహ్వానించడం అక్కడ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి, చైనా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా బలూచిస్తాన్‌లో ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయి.

Balochistan Independence Day World Peace United Ambassador Makes Shocking Predictions on Pakistan Future

పాకిస్తాన్‌పై ఆర్థిక దెబ్బ
వరల్డ్ పీస్ యునైటెడ్ రాయబారి పర్వీందర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బలూచిస్తాన్ భూభాగంలో బంగారం, విలువెన రాళ్లు, అరుదైన ఖనిజ వనరులు సమృద్దిగా ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆర్థిక పునాదిలో దాదాపు 75 శాతం ఆదాయాన్ని ఈ ప్రాంతపు వనరులపైనే ఆధారపడి పొందుతోంది. ముఖ్యంగా చైనాతో సహా అనేక దేశాలకు ఖనిజాల ఎగుమతికి ఇది కీలక కేంద్రంగా మారింది. ఒకవేళ బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే పాకిస్తాన్ బలూచిస్తాన్‌పై నియంత్రణను వదులుకునేందుకు సిద్ధంగా లేదు.

e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!
e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!

బలూచిస్తాన్‌కు అంతర్జాతీయ మద్దతు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 56 కంటే ఎక్కువ దేశాలు బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాటానికి, వారి ప్రాథమిక హక్కులకు మద్దతు ఇస్తున్నాయి. 21వ శతాబ్ధంలో బలప్రయోగం, హింస ద్వారా భూభాగాలను అదుపులో ఉంచడం సాధ్యం కాదని.. బలూచిస్తాన్ ప్రజలకు తమ స్వేచ్ఛను వేడుకగా జరుపుకోవడానికి అనుమతించడమే అంతర్జాతీయ శాంతి దిశగా వేసే సరైన అడుగు అని దౌత్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+