పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది.
నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పెరిగింది. 1.22 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా లాభపడింది. కేజీకి 1.05 శాతం లాభంతో రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,160, 22 క్యారెట్లు రూ.1,42,230 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,40,010 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,930, 22 క్యారెట్లు రూ.1,42,019 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,55,050 కాగా 22 క్యారెట్లు రూ.1,42,129. వెండి కిలో రూ.2,40,100 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,370, 22 క్యారెట్లు రూ.1,42,423, వెండి రూ.2,40,330 వద్ద కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,546, 22 క్యారెట్లు - రూ. 14,250, 18 క్యారెట్లు - రూ. 12,000
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635

Click it and Unblock the Notifications