వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే టీ బిల్లు: షిండే

పాట్నా, బెంగళూర్, బుద్ధగయల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల కేసులు పరిష్కారమయ్యాయని షిండే చెప్పారు. 2013లో ఈ మూడు సంఘటనలతో పాటు హైదరాబాద్‌లోనూ పేలుళ్లు సంభవించాయని ఆయన చెప్పారు. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) డేటా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉగ్రవాద కుట్రల సమాచారాన్ని సకాలంలో నిఘా, భద్రతా దళాలకు ఇచ్చి వారిని తక్షణమే రంగంలోకి దించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో కూడిన నాట్ గ్రిడ్ జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని షిండే చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను పరిశీలించేందుకు మరింత గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ మేరకు కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేంద్రం చర్చించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications