10 సెకండ్లలోనా, అద్వానీ కూడా షాక్: జగన్ ఆశ్చర్యం

ఆయన ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిన్నటి ఘటన ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పది సెకండ్లలో బిల్లు పెట్టడం సాధ్యమా అన్నారు.
బిల్లు పెడుతున్నట్లు ఎవరికీ చెప్పలేదన్నారు. తాను రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించవద్దని కోరినట్లు తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. లోకసభలో గందరగోళం మధ్య బిల్లు పెట్టడాన్ని పలు పార్టీల నేతలం వెళ్లి అడిగామన్నారు.
అసెంబ్లీ వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రాన్ని ఇలా విభజిస్తూ పోతే రేపు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లను కూడా విడదీయవచ్చునన్నారు. కాంగ్రెసు పార్టీ అప్రజాస్వామ్య వైఖరి పైన ప్రతిపక్షాలు అన్ని ఒక్కటి కావాలన్నారు. రాష్ట్ర విభజన కచ్చితంగా ఆగిపోతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications