ఢిల్లీలో దినకరన్: బెండ్ తీస్తారని ఆందోళన: మాతోపెట్టుకుంటే ఇంతే !

ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ఢిల్లీ చేరుకున్నారు. దినకరన్ పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఢిల్లీ పోలీసులు ఆయన్ను బెండ్ తీసినా ఆశ్చర్యం లేదు.

న్యూఢిల్లీ/చెన్నై: ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ శనివారం ఢిల్లీ చేరుకున్నాడు. ఎన్నికల సంఘం అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో టీటీవీ దినకరన్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎన్నికల అధికారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

రూ. 1.30 కోట్లు సీజ్ చేశారు

రూ. 1.30 కోట్లు సీజ్ చేశారు

సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అతని నుంచి రూ. 1.30 కోట్లు, రెండు విలాసవంతమైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.30 కోట్లు సుఖేష్ చంద్రశేఖర్ దగ్గరకు ఎలా వచ్చిందంటూ పూర్తి వివరాలను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సేకరించారు.

టీటీవీ దినకరన్ ఇచ్చారు

టీటీవీ దినకరన్ ఇచ్చారు

ఎన్నికల కమిషన్ అధికారికి లంచం ఇవ్వాలని రూ. 1.30 కోట్లు టీటీవీ దినకరన్ తనకు ఇచ్చారని ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. అంతే కాకుండా డీల్ ఎంతకు కుదిరింది అనే పూర్తి సమాచారం చెప్పేశాడని తెలిసింది.

ఆయనే ప్రధాన సూత్రదారి

ఆయనే ప్రధాన సూత్రదారి

ఎన్నికల కమిషన్ అధికారికి లంచం ఎరవేశారన్న వ్యవహారం వెనుక ప్రధాన సూత్రదారి టీటీవీ దినకరన్ అని ఢిల్లీ పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారు. ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్న దినకరన్ ఇక ఎంత మంది పేర్లు బయటకు చెబుతాడో వేచిచూడాలి.

ఢిల్లీ పోలీసుల చేతిలో దినకరన్ జుట్టు

ఢిల్లీ పోలీసుల చేతిలో దినకరన్ జుట్టు

లంచం కేసులో విచారించడానికి సిద్దం అయిన ఢిల్లీ పోలీసులు తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ దినకరన్ ఆందోళన చెందుతున్నాడు. దినకరన్ వెంట ఆయన న్యాయవాదులు ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావడానికి సిద్దం అయ్యారు.

 బెయిల్ కోసం ప్రయత్నం

బెయిల్ కోసం ప్రయత్నం

శనివారం విచారణకు హాజరు అవుతున్న టీటీవీ దినకరన్ నేరం చేసినట్లు అంగీకరిస్తే కచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే దినకరన్ కు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఇప్పటికే ఆయన న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు రోజులు అంతే

రెండు రోజులు అంతే

శనివారం దినకరన్ అరెస్టు అయితే రెండు రోజులు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఆదివారం కోర్టులు సెలవు కావడంతో దినకరన్ ఆందోళన చెందుతున్నాడని సమాచారం. దినకరన్ అరెస్టు అయితే ఆయన్ను న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

బెండ్ తీస్తారా ?

బెండ్ తీస్తారా ?

దినకరన్ అరెస్టు అయితే సోమవారం ఆయన న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు. దినకరన్ పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఢిల్లీ పోలీసులు ఆయన్ను బెండ్ తీసినా ఆశ్చర్యం లేదు. ఢిల్లీ పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారో అంటూ శశికళ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+