Viral Fever: వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఈ పని చేయండి..
ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాల కారణంగా చాలా చోట్ల వర్షపు నీరు నిల్వ ఉంటుంది. అక్కడ దోమలు తయారై వ్యాధులను వ్యాప్తి చెందుతాయి. చల్లటి వాతావరణంలో వైరల్ జ్వరాలు వస్తుంటాయి. వైరల్ జ్వరం బారిన పడకుండా ముందే జాగ్రత్త పడితే ఆరోగ్యంతోపాటు డబ్బు కూడా మిగులుతుంది.

వేడి వేడి ఆహారం..
వర్షాకాలంలో వైరల్, బ్యాక్టీరియాలు యాక్టివ్‌గా ఉండటం వల్ల వ్యాధులు త్వరగా వ్యాపించేందుకు అవకాశాలు ఎక్కువ. జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో పోషకాహారం తీసుకోవాలి. వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిద.

జ్వరం, దగ్గు, జలుబు..
ప్రస్తుత సీజన్ లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు పచ్చిగా ఉండటం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యలను సంప్రదించాలి. జలుబు లేదా జ్వరం, తుమ్ములు, దగ్గు ఉన్నప్పుడు టిష్యూ పేపర్ లేదా చేతి రూమాలు వాడాలి వేడి నీళ్లు తాగాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి ఎక్కువగా తీసుకోవాలి.

వెల్లుల్లి తీసుకోవాలి..
తీసుకునే ఆహారంలో పసుపు, సొంఠి, అల్లం, లవంగ, వాము, ఇంగువ, బెల్లం వంటి వేడి చేసే పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే మంచిద. ఆకుపచ్చ కూరగాయలు, వెల్లుల్లి తీసుకుంటే శరీరానికి వేడిగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ఆరోగ్యానికి మంచిది. యాపిల్, అరటి పండ్లు, బత్తాయి వంటి పండ్లు తినాలి.












Click it and Unblock the Notifications