ఠాకూరు బీజేపీలో చేరొద్దు : తిరిగి పార్టీలోకి తీసుకొస్తానన్న హర్ధిక్
న్యూఢిల్లీ : గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఠాకూర్ నేత అల్పేశ్ చేసిన రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. దీంతో అల్పేశ్ స్నేహితులను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. అల్పేశ్ రాజీనామాకు కారణలేంటో తెలియదని, కానీ అతనిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పాటిదార్ ఉద్యమనేత హర్ధిక్ పటేల్, దళిత సమస్యలపై పోరాడుతోన్న జిగ్నేశ్ మేవాని.

పార్టీలోకి తీసుకొస్తా ..?
అల్పేశ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకొస్తానని స్పష్టంచేశారు హర్ధిక్ పటేల్. రాజీనామాపై ఠాకూర్‌తో మాట్లాడి .. అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుంటానని చెప్పారు. అతనిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తాననే ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో మాత్రం చేరొద్దు ?
పార్టీకి రాజీనామా చేసిన అల్పేశ్ ..బీజేపీలో మాత్రం చేరొద్దంటున్నారు దళిత నేత జిగ్నేశ్ మేవాని. ఠాకూర్ వర్గానికి, పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీలో చేరొద్దని సూచిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వీడటానికి కారణాలను తెలుసుకొని, తగిన సూచన ఇస్తానని స్పష్టంచేశారు.

వీరు ముగ్గురు మంచి స్నేహితులు
గుజరాత్‌లో దళిత సమస్యలపై పోరాడుతున్న జిగ్నేశ్ మేవాని, పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్, ఓబీసీ నేత అల్వేశ్ ఠాకూరు తమ వర్గం ప్రయోజనాల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు ముగ్గురు మంచి స్నేహితులు కూడా. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకొని .. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ నిన్న అల్వేశ్ రాజీనామా చేయడంతో వీరిద్దరూ స్పందించారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications