ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్వాన్నంగా మారిన పరిస్థితులు: ఎంబసీలను ఖాలీ చేయిస్తున్న భారత్
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్‌ను ఆక్రమించేందుకు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో భారత రాయబార కార్యాలయం సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆఫ్గనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తీసుకొస్తామని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
కాగా, అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి తరలిపోయిన కొద్ది రోజుల్లోనే తాలిబన్లు దాడులు చేసి ఆఫ్టాన్‌లోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాందహార్, హెరాత్, లష్కర్‌ఘాలతో కలిపి 18 రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు తాలిబన్లు చేజిక్కించుకోవడం గమనార్హం. ఆఫ్ఘాన్ ఆర్థిక మంత్రి ఖలీద్ రాజీనామా చేసి, దేశాన్ని వీడి పారిపోవడం చూస్తే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

తాలిబన్ల దాడులతో తీవ్ర ఆందోళన చెందిన ఆఫ్గాన్ ప్రభుత్వం.. పాలనాధికారాలను వారితో పంచుకోవడానికి కూడా సిద్ధమైంది. ఖతార్‌లో జరుగుతున్న చర్చల్లో రాజీ సూత్రం ప్రాతిపాదించింది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న తాలిబన్ల నుంచి దీనిపై ఇప్పటి వరకు స్పందన రాలేదు.
కాగా, ఆఫ్ఘాన్ భద్రతా దళాలు తాలిబన్లను ఎదుర్కోలేని స్థితిలోకి వెళ్లిపోవడంతో తాలిబన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. నిబద్ధత లోపించిన ఆఫ్ఘాన్ భద్రతా దళాల కారణంగా ఘనీ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. మరో మూడు నెలల్లో కాబూల్ కూడా తాలిబన్ల వశం కానుందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో మిగిలిన సిబ్బందిని తరలించేందుకు మూడు వేల మంది సైనికులను తిరిగి ఆఫ్ఘాన్‌కు పంపనున్నట్లు అమెరికా విదేశాంగా శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
ఇది ఇలావుంటే, మరో వారం రోజుల్లోనే కాబూల్ సహా దేశం మొత్తం తమ ఆధీనంలో ఉంటుందని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. కాగా, తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండగా ఉంటోంది. తమ దేశంలోని ఉగ్రస్థావరాలను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శరణార్థి శిబిరాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. భారత వ్యతిరేక ఉగ్ర శిబిరాలను తాలిబన్ పాలిత ఆఫ్ఘాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల నుంచి బయటపడాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తోంది. పాక్ కుట్రలను పసిగట్టిన భారత్.. తాలిబన్లతో తెర వెనుక చర్చలు జరిపింది.
ఐరాసలోని తాలిబన్లపై ఆంక్షల కమిటీ అధ్యక్ష హోదాలో వారి నాయకుల ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, పాక్‌తో ఎప్పట్నుంచో స్నేహం కొనసాగిస్తున్న తాలిబన్లపై ఇవేమీ ప్రభావం చూపలేదు. భారత్ నిర్మించిన సల్మా డ్యామ్ సహా పలు ప్రాజెక్టులపై తాలిబన్లు దాడులతో విరుచుకుపడుతున్నారు. దీంతో తాలిబన్ల వైఖరిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
కాబూల్(ఆఫ్ఘనిస్థాన్)పై ఎలాంటి బలవంతపు పాలననూ తాము గుర్తించబోమని అమెరికాతో కలిసి ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా తాలిబన్లకు మద్దతు తెలుపుతున్న పాక్ వైఖరిని తప్పబట్టింది. ఇప్పటికే మజారే షరీఫ్‌లోని దౌత్య కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ క్రమంలోనే ఆఫ్గాన్‌లోని భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది భారత్.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications