'మగపిల్లలతో సెక్స్..' : అక్కడదో అస్త్రం..

తరిన్ కోట్ : శత్రువుతో అన్నిసార్లు ప్రత్యక్ష యుద్దానికి దిగి తలపడడం కష్టం.. టార్గెట్ చేస్తున్నామన్న విషయం తెలియకుండా దెబ్బకొట్టడానికి వాళ్ల బలహీనతలపై కన్నేయడం, ఆపై దాన్నే ఓ అస్త్రంగా మలుచుకోవడం క్రిమినల్ బ్రెయిన్స్ లో మెదిలే మొదటి ఆలోచన.

సరిగ్గా ఇదే పాయింట్ పై ఓ ఫోకస్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ బృందం.. ఆ దేశ భద్రతా దళాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇంతకీ ఆ తాలిబన్లు అస్త్రంగా మలుచుకున్న వాళ్ల బలహీనత ఏంటంటే మగ పిల్లలతో సెక్స్. వినడానికే కంపరం పుడుతోన్న ఈ వ్యవహారం శతాబ్దాలుగా ఆఫ్ఘన్ లో వేళ్లూనుకుపోయిన ఓ నీచ సంస్కృతి.

ముద్దులొలికే చిన్నారులను తమ లైంగిక బానిసలుగా వాడుకునే విష సంస్కృతి ఏళ్లుగా అక్కడ రాజ్యమేలుతోంది. దీనికి అక్కడి పోలీసు వర్గాలు కూడా అతీతమేమి కాదు. అక్కడి చాలామంది కమాండర్లు మగపిల్లలను తీసుకొచ్చి తమ కామ ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇదే ఇప్పుడక్కడి తాలిబన్లకు అస్త్రంగా మారింది.

Taliban use 'child sex slaves' to mount attacks on Afghan police

అందమైన మగపిల్లలను భద్రతా దళాల స్థావరాల్లోకి పంపిస్తున్న తాలిబన్లు, వాళ్ల ద్వారా రహస్య విషయాలను సేకరిస్తున్నారు. అసలు విషయం తెలియని కమాండర్లు కనిపించే ప్రతి మగపిల్లాడిని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటూ చివరికి తాలిబన్ల చేతికి చిక్కుతున్నారు. రెండేళ్లుగా తాలిబన్లు అక్కడి కమాండర్ల మీద ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇదే అస్త్రం ద్వారా గడిచిన జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలోనే దాదాపుగా ఆరుసార్లు దాడులకు పాల్పడ్డారు తాలిబన్లు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు, న్యాయశాఖ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

తాలిబన్ల చర్యలను తిప్పికొట్టడంలో విఫలమై, భద్రతాపరమైన మార్పుల్లో భాగంగా పదవిని కోల్పోయిన ఉరుజ్ గాన్ లోని గులాం లెవనాయ్ అనే ఛీఫ్ పోలీస్ అధికారి ఇదే విషయమై పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. అందమైన కుర్రాళ్లను చెక్ పాయింట్స్ లోకి పంపించి పోలీసులకు గాలం వేస్తున్నారని తెలిపారు. సదరు కుర్రాళ్ల చేత డ్రగ్స్, విషం వంటి వాటిని పంపిస్తూ.. వాళ్లతోనే హత్యలు కూడా చేయిస్తున్నారని పేర్కొన్నారు.

మగపిల్లలతో సెక్స్ కి అక్కడి పోలీసు అధికారులు ఎంత బానిసలుగా మారిపోయారంటే.. ఆత్మాహుతి బాంబర్లను అయినా నిలువరించవచ్చు గానీ, ఈ అందమైన మగ పిల్లలను నిలువరించడం కష్టమని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి అక్కడ ఈ చెత్త సంస్కృతి తీవ్రత ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+