నటి శ్రీదేవి చస్తే సాంగ్స్, సన్నీ లియోన్ చస్తే ఏం చేస్తారు ? నటి కస్తూరి, నెటిజన్లు, ఫైట్!
చెన్నై: బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి చస్తే ప్రచారం కోసం మీడియా టీవీ చానల్స్ లో ఆమె సినిమా పాటలు వేసి టీఆర్ పీ రేటు పెంచుకోవడానికి ప్రయత్నించిందని, అదే సన్నీ లియోన్ చస్తే ఏం చేస్తారని బహుబాష నటి కస్తురి శంకర్ అలియాస్ కస్తూరి మీడియాను సూటిగా ప్రశ్నించారు. ఐదు బాషల్లో దాదాపు 245 సినిమాల్లో నటించిన ప్రముఖ నటి శ్రీదేవి మరణిస్తే విషాదం వ్యక్తం చెయ్యకుండా ఆమె గ్లామర్ రోల్స్ నటించిన రోమాంటిక్ సినిమా పాటలు వేస్తూ ఆమె అభిమానులను కించపరిచారని నటి కస్తూరి ఆరోపించారు.

శ్రీదేవి చస్తే సాగ్స్ ఓకే, సన్నీ చస్తే ఏం చేస్తారు ?
అన్ని మీడియా చానల్స్ లో శ్రీదేవి చనిపోయిన తరువాత ఆమె నటించిన సినిమా పాటలు, ఈవెంట్ వీడియో క్లిప్పింగ్స్ వేశారు ఓకే, సన్నీ లియోన్ చనిపోయిన రోజు ఏం చేస్తారు అంటూ నటి కస్తూరి సోషల్ మీడియాలో మీడియాను ప్రశ్నించారు. విషయం గుర్తించిన నెటిజన్లు కస్తూరికి సరైన సమాధానం ఇస్తున్నారు.
మహిళా సంఘాలకు సవాల్
ఇదే రీతిలో ఓ పురుషుడు ఏమైనా ట్వీట్ చేసి ఉంటే ఇప్పటికే రాద్దాంతం అయిపోయి ఉండేదని, ఇప్పుడు మీరు ఎలా స్పంధిస్తారని మహిళా సంఘాలు, స్త్రీవాదులకు నెటిజన్లు సవాలు విసిరారు.
ఎవరి అర్థం వారిదే
నేను కాపీ పేస్ట్ చేశాను అంతే, కస్తూరి వ్యాఖ్యలను ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అనే విషయం వారి మనస్థత్వానికి వదిలేస్తున్నాం అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.
అర్థం కాకపోతే వదిలేయండి
నటి కస్తూరి చెప్పింది మీడియాకు, అందరికీ కాదు, ఆమె ట్వీట్ ను అర్దం చేసుకుంటే చేసుకోండి, అర్థం కాకపోతే వదిలేయండి అంటూ కొందరు ఆమెకు మద్దతు ఇస్తున్నారు.
ప్రతి ట్వీట్ కు కస్తూరి రీట్వీట్
కస్తురి చేసిన ట్వీట్ కు స్పంధించిన ప్రతి ట్వీట్ కు ఆమె రీట్వీట్ చేస్తున్నారు. సన్నీ లియోన్ ను కవర్ చెయ్యరని, మొత్తం అన్ కవర్ చేస్తారని కస్తూరి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
సన్నీ కథ సరే, మీ కథ ఏంటి ?
సన్నీ లియోన్ గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తారు, మీ వరకు అదే విషయం వస్తే ఏం చేస్తారో ఆలోచించండి. తమరు నటించిన ఇలాంటి హాట్ సీన్స్ ఫోటోలు మొత్తం బయటకు వస్తాయోమో జాగ్రత్త, మొదట వీటిని డిలీట్ చెయ్యండి, మీరు ఆడుకోవడానికి ఇది సమయం కాదని పలువురు కస్తూరి నటించిన సినిమాల ఫోటోలు ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications