వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు: బీజేపీలోకి హీరో అజిత్

చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తమిళనాట రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోనూ సత్తా చాటాలని చూస్తోంది.

ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమిళనాట మరో స్టార్ హీరో రాజకీయ తెరంగేట్రం చేయనున్నారు. అభిమానులు ముద్దుగా 'తలై' అని పిల్చుకునే అజిత్ త్వరలోనే బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

హీరో అజిత్‌తో ఆ పార్టీ జాతీయ నేతలు మంతనాలు జరిపారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని విశ్వసనీయ సమాచారం. అజిత్‌తో ఇప్పటికే తమిళనాడు బీజేపీ నేతలు కూడా చర్చించారని, ఆయన త్వరలో ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Tamil hero Ajith may join in bjp

కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై దాఖలైన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక కోర్టు జయలలితకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమెను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో మరో నెల రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆ తర్వాతే తమిళనాడులో రాజకీయ పొత్తులు ఖరారు అవుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జయలలితతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సుప్రీంకోర్టులో జయకు వ్యతిరేకంగా తీర్పు వస్తే డీఎంకేతో పాటు జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ (టీఎంసీ)తో కూడా బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ జయ నిర్దోషిగా బయటపడితే ఆమె ఇచ్చే సీట్లతో సర్దుకొని ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+