ప్రముఖ నటి ఆత్మహత్య, సినిమాలు, టీవీ సీరియళ్లు, భర్తతో, ఒక్కసారిగా దెబ్బ, బెంగళూరుకు వీడియోలు !
చెన్నై: కుటుంబ సమస్యల కారణంగా అనేక సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన నటి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సినిమాల్లో తరచూ అవకాశాలు లేకపోవడం, చిన్నచితకా అవకాశాలు వచ్చినా వాటిని అంగీకరించకపోవడం, భర్తతో పదేపదే గొడవలు జరగడంతో జీవితంపై విరక్తి చెందిన నటి ఆత్మహత్య చేసుకుంది. ఒక్కసారిగా దెబ్బపడటంతో ఆ నటి కుంగిపోయింది. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ నటి బోరున విలపిస్తూ తీసిన వీడియోలను బెంగళూరులోని అక్కయ్యలకు పంపించడం కలకలం రేపింది.

సినిమాలు, టీవీ సీరియళ్లు
తమిళనాడు రాజధాని చెన్నై సిటీ సమీపంలోని తిరువత్తియూర్ లో పద్మజ (23) అనే యువతి నివాసం ఉంటోంది. పద్మజ అనేక తమిళ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించింది. నటి పద్మజ కొంతకాలం క్రితం పవన్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చెన్నై సిటీ సమీపంలోని తిరువత్తియూర్ లో పద్మజ, పవన్ రాజ్ దంపతులు కొంతకాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

ఆ విషయాల్లో గొడవలు
ఇటీవల కాలంలో పద్మజకు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు తగ్గిపోవడంతో పద్మజ కొంత ఆందోళనకు గురైయ్యింది. అదే సమయంలో పద్మజ, పవన్ రాజ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నిత్యం ఇంటిలో పవన్ రాజ్, పద్మజ దంపతులు పదేపదే గొడవపడుతున్నారు.

అర్దరాత్రి వెళ్లిపోయిన భర్త
శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత పద్మజ, పవన్ రాజ్ ఇంటిలో గొడవపడ్డారు. గొడవ తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన పవన్ రాజ్ అర్దరాత్రి ఇంటిలో నుంచి బయటకువెళ్లిపోయాడు. తరువాత పద్మజ మాత్రమే ఇంటిలో ఉంది. పవన్ రాజ్ ఇంటికి రాకపోవడం, కనీసం ఫోన్ కూడా చెయ్యకపోవడంతో పద్మజ మరింత కుంగిపోయింది.

అసలు ఏం జరిగిందో ?
ఆదివారం ఎంత సేపటికి పద్మజ, ఆమె భర్త పవన్ రాజ్ బయటకు రాకపోవడం, ఇంటి తలుపులు మూసివేసి ఉండటంతో ఆ ఇంటి యజమాని వెళ్లి చేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని పద్మజ నివాసం ఉంటున్న మెయిన్ డోర్ చిన్నగా లోపలికి నెట్టగా అవి తెరుచుకున్నాయి. ఇంటిలో పద్మజ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడంతో ఇంటి యజమాని షాక్ కు గురై పోలీసులకు, ఆమె భర్త పవన్ రాజ్ కు సమాచారం ఇచ్చారు.

బెంగళూరులోని అక్కయ్యలకు వీడియోలు !
ఇంటికి చేరుకున్న పోలీసులు పద్మజ మృతదేహాన్ని పరిశీలించి వైద్యపరీక్షల కోసం స్టాలిన్ ఆసుపత్రికి తరలించారు. పద్మజ ఆత్మహత్య చేసుకునే ముందు బోరున విలపిస్తూ ఇంతకు ముందు జరిగిన విషయాలు చెబుతూ వీడియోలు తీసి వాటిని బెంగళూరులో నివాసం ఉంటున్న అక్కయ్యలకు పంపించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అందుకే నటి ఆత్మహత్య ?
భర్త వేదింపుల కారణంగా నటి పద్మజ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు పవన్ రాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్న నటి పద్మజ ఆత్మహత్య చేసుకోవడంతో తమిళ సినీరంగ ప్రముఖులు షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications