వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్లో మమత రాజ్యం, తమిళనాడు జయదే: మోడీ ట్వీట్‌కు 'థ్యాంక్స్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో మూడు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.- తమిళనాడులో డీఎంకె 10, అన్నాడీఎంకే 3 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తిరువావూర్ నుంచి డీఎంకే అధినేత కరుణానిధి విజయం సాధించారు.

- పుదుచ్చేరిలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి 13 స్థానాల్లో గెలిచి, 3 స్థానాల్లో ముందంజలో ఉంది. రంగస్వామి కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచింది. అన్నాడీఎంకే 2 స్థానాల్లో గెలిచింది. తొలుత ఇక్కడ హంగ్ వస్తుందనుకున్నారు.

- అసోంలో బీజేపీ కూటమి 19 గెలిచి, 71 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచి 18 స్థానాల్లో ముందంజలో ఉంది.

- కేరళలో ఎల్డీఎఫ్ 91 స్థానాల్లో గెలిచింది. యూడీఎఫ్ 47 స్తానాల్లో గెలిచింది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది.

- తమిళనాడు అన్నాడీఎంకే 15 స్థానాల్లో గెలిచి, 121 స్థానాల్లో ముందంజలో ఉంది. డీఎంకే 17 స్థానాల్లో గెలిచి 77 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 192 స్థానాల్లో గెలిచి, 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్ 23 స్థానాల్లో గెలిచి, 6 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో గెలిచింది.

- తమిళనాడులో జయలలిత, బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వారికి ఫోన్ చేశారు. వారికి ఫోన్లో అభినందనలు తెలియజేశారు. జయలలితకు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశానని ప్రధాని మోడీట్విట్టర్లో ట్వీట్ చేశారు. అలాగే మమతకు కూడా కాల్ చేసి అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసినట్టు పేర్కొన్నారు. రెండో సారి పాలనా పగ్గాలు చేపడుతున్న ఆమెకు శుభాకాంక్షలు అందించినట్టు తెలిపారు. 'మోడీజీ థ్యాంకూ వెరీ మచ్ అంటూ' మమతా ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు.

- బెంగాల్లో తృణమూల్ 203, లెఫ్ట్ 26, కాంగ్రెస్ 43, బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

- కేరళలో ఎల్డీఎప్ 95, యూడీఎఫ్ 42, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

- అసోంలో ఎన్డీయే 83, కాంగ్రెస్ 27 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పన్నెండు గంటల సమయానికి.. తమిళనాడులో అన్నాడీఎంకే 133, డీఎంకే 97 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ 12, కాంగ్రెస్ - డీఎంకే 13, అన్నాడీఎంకే 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- అసోంలో ఎన్డీయే 79, కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- పశ్చిమ బెంగాల్లో తృణమూల్ 208, లెఫ్ట్ 31, కాంగ్రెస్ 41, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తమిళనాడులో.. అన్నాడీఎంకే 136, డీఎంకే 93 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పదకొండు గంటల సమయానికి.. కేరళలో ఎల్డీఎఫ్ 90, యూడీఎఫ్ 48 స్థానాల్లో ముందంజలో ఉంది.

- కేరళలో ఎల్డీఎఫ్ 90, యూడీఎఫ్ 47, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తమిళనాడులో అన్నాడీఎంకే 134, డీఎంకే 84, డీఎంకే 1, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

- బెంగాల్లో తృణమూల్ 211, లెఫ్ట్ 32, కాంగ్రెస్ 41, బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ పార్టీ 10, డీఎంకే - కాంగ్రెస్ 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పదింపావు సమయానికి అసోంలో బీజేపీ 81, కాంగ్రెస్ 23 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తమిళనాడులో డీఎంకే గెలుస్తుందని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అన్నాడీఎంకే గెలుస్తుందని కొందరు చెప్పారు. లోకల్ సర్వేలు ఎక్కువగా నిజమయ్యాయి.

- కేరళలో లెఫ్ట్ 85, ఎల్డీఫ్ 65, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- బెంగాల్లో తృణమూల్ 211, లెఫ్ట్ 31, కాంగ్రెస్ 39, బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది.

Tamil Nadu Assembly elections 2016: Last minute scenario as parties pray for a magic

- తమిళనాడులో అన్నాడీఎంకే 127, డిఎంకే - కాంగ్రెస్ 75, బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది.

- అసోంలో సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు తెరపడుతోంది. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తొమ్మిది నలభై అయిదు నిమిషాల సమయంలో.. అసోంలో 126 సీట్లకు గాను బీజేపీ 80, కాంగ్రెస్ 19 స్థానాలలో మందంజలో ఉంది.

- కేరళలో 87, యూడీఎఫ్ 50, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- బెంగాల్లో మమతా బెనర్జీ 200, లెఫ్ట్ 28, కాంగ్రెస్ 39, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తమిళనాడులో అన్నాడీఎంకే 101, డీఎంకే - కాంగ్రెస్ 74, బీజేపీ 2 స్థానాల్లో, డీఎండీకే కూటమి 0 స్థానాల్లో ముందంజలో ఉంది.

- తొమ్మిదిన్నర గంటల సమయానికి.. అసోంలో ఎన్డీయే 60, కాంగ్రెస్ 20 స్థానాలలో ముందంజలో ఉంది.

- తమిళనాడులో ఏ పార్టీ గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- అన్నాడీఎంకే మొదట వెనుకబడింది. ఆ తర్వాత మాత్రం పుంజుకుంది. అన్నాడీఎంకే దూసుకెళ్తున్నందున జయలలిత ఇంటికి అభిమానులు తరలి వస్తున్నారు.

- బెంగాల్లో తృణమూల్ 153, లెఫ్ట్ 32, కాంగ్రెస్33, బీజేపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

- అసోంలో బీజేపీ 40, కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది.

- కేరళలో యూడీఎఫ్ 74, ఎల్డీఎఫ్ 51, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది.

- ఉదయం తొమ్మిదింపావు సమయానికి అన్నాడీఎంకే 78, డీఎంకే - కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- ఆర్కే నగర్‌లో జయలలిత ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.

Tamil Nadu Assembly elections 2016: Last minute scenario as parties pray for a magic

- బెంగాల్లో తృణమూల్ 153, లెఫ్ట్ 32, కాంగ్రెస్33, బీజేపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

- అసోంలో బీజేపీ 40, కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది.

- కేరళలో యూడీఎఫ్ 74, ఎల్డీఎఫ్ 51, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది.

- ఉదయం తొమ్మిదింపావు సమయానికి అన్నాడీఎంకే 78, డీఎంకే - కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- ఆర్కే నగర్‌లో జయలలిత ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.

- యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణా రావు ముందంజలో ఉన్నారు.

- పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ 2, డీఎంకే - కాంగ్రెస్ 9, అన్నాడీఎంకే 2 స్థానాల్లో ముదంజలో ఉంది.

- కేరళలో ఎల్డీఎఫ్ 73, యూడీఎప్ 51, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- అసోంలో బీజేపీ 32, కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందంజలో ఉంది.

- బెంగాల్లో తృణమూల్ 131, లెఫ్ట్ 28, కాంగ్రెస్ 27, బీజేపీ 2 స్థానాల్లో ముదంజలో ఉంది.

- తొమ్మిది గంటల సమయానికి తమిళనాడులో అన్నాడీఎంకే కొంత ముందంజలో ఉంది. తొలుత వెనుకపడిన జయ పార్టీ ఆ తర్వాత కొంత దూసుకెళ్తోంది. అన్నాడీఎంకే 64 స్థానాల్లో, డీఎంకే 48 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ 1, కాంగ్రెస్ - డిఎంకే 7, అన్నాడీఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

- అసోంలో ఎన్డీయే 19, యూపీఏ 10 స్తానాల్లో ముందంజలో ఉంది.

Tamil Nadu Assembly elections 2016: Last minute scenario as parties pray for a magic

- తమిళనాడులో అన్నాడీఎంకే 40, డీఎంకే -కాంగ్రెస్ 37, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది.

- తొమ్మిది గంటల సమయానికి బెంగాల్లో తృణమూల్ 115, లెఫ్ట్ 25, కాంగ్రెస్ 22, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది.

- మమతా బెనర్జీ రెండోసారి అధికారంలోకి రానుందని మెజార్టీ చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.

- కొట్టాయంలో బీజేపీ అభ్యర్థి ముందంజ. ఈ ఎన్నికల ద్వారా కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తోంది.

- తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరా హోరీ ఉంది. డీఎంకే 26, అన్నాడీఎంకే 25 స్థానాల్లో ముందంజలో ఉంది.

- పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 99, లెఫ్ట్ 20, కాంగ్రెస్ 18, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది.

- అసోంలో బీజేపీ-మిత్రపక్షాలు 18, కాంగ్రెస్ - మిత్రపక్షాలు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

- కేరళలో ఎల్డీఎఫ్ 45, యూడీఎఫ్ 35, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

- పుదుచ్చేరిలో కాంగ్రెస్ - డీఎంకె కూటమి 4 స్థానాల్లో, రంగస్వామి కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

- యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ముందంజలో ఉన్నారు.

- ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగా ఫలితాలు కనిపిస్తున్నాయి.

- అసోంలో బీజేపీ 6, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉంది.

- పశ్చిమ బెంగాల్లో తృణమూల్ 71, లెఫ్ట్ - కాంగ్రెస్ 15, బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

- ఎనిమిదిన్నర గంటల సమయానికి కేరళలో ఎల్డీఎఫ్ 40, యూడీఎఫ్ 28, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

- కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వెనుకంజలో ఉన్నారు.

- కేరళలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి రాజగోపాలన్ ముందంజలో నిలిచారు.

- తమిళనాడు ఎన్నికల్లో జాతీయ ఛానల్ సర్వేల ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు ఓ రకంగా ఉండగా, లోకల్ ఛానల్ సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మరో రకంగా ఉన్నాయి. డీఎంకే కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఎక్కువ జాతీయ ఛానల్ సర్వేలు చెప్పాయి. లోకల్ ఛానల్స్ మాత్రం జయలలిత వైపు మొగ్గు ఉందని తెలిపాయి.

- కేరళలో ఎల్టీఎఫ్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చేలా ఉంది. ఎల్డీఎఫ్ 30, కాంగ్రెస్ 15, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది.

- తమిళనాడులో డీఎంకే 3, అన్నాడీఎంకే 1 స్థానంలో ముందంజలో ఉంది.

- అసోంలో బీజేపీ 4, కాంగ్రెస్ 1 సీటులో ముందంజలో ఉంది.

- పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దూసుకు పోతోంది. ఎనిమిదిన్నర గంటల సమయానికి తృణమూల్ 35, లెఫ్ట్ - కాంగ్రెస్ కూటమి 10, బీజేపీ 4 సీట్లలో ముందంజలో ఉంది.

- కేరళలో ఎల్డీఎఫ్ దూసుకు పోతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, అసోంలో బీజేపీ దూసుకుపోతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే కంటే డిఎంకే కొంత ముందంజలో కనిపిస్తోంది.

English summary
The scenario at the Tamil Nadu Assembly elections is unpredictable. For the first time in the history of state politics, there is no clear majority visible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X