Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 మంది మహిళలతో కామాంధుడి చెలగాటం, మొబైల్ లో ట్రాక్ వ్యూ యాప్

చెన్నై: ఎంసీఏ పూర్తి చేసిన యువకుడు మొబైల్ లో ట్రాక్ వ్యూ యాప్ టెక్నాలజీ సహాయంతో 100 మంది మహిళల జీవితంతో చెలగాటం ఆడాడు, మహిళల వ్యక్తిగత రహస్య సమాచారం తెలుసుకుని వారిలో కొందరిని బెదిరించి అత్యాచారం చేశాడు. చివరికి వరసకు సోదరి అయ్యే వివాహిత మహిళను, సొంత చెల్లెలను కామాంధుడు వదిలిపెట్టలేదు. అయితే అతని పాపంపండిపోయి పోలీసులకు చిక్కిపోయిన ఘటన తమిళనాడులో జరిగింది.

విందుకు వెళ్లాడు

విందుకు వెళ్లాడు

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పనైకులం ప్రాంతంలో నివాసం ఉంటున్న దినేష్ కుమార్ ఎంసీఏ పూర్తి చేశాడు. ఇతను ఓ శుభకార్యం సందర్బంగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరసకు సోదరి అయ్యే మహిళ ఇంటికి భోజనానికి వెళ్లాడు. వరసకు తమ్ముడు అయ్యే దినేష్ కుమార్ మీద ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు.

సెల్ ఫోన్ ఇచ్చింది

సెల్ ఫోన్ ఇచ్చింది

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త పంపించిన సెల్ ఫోన్ ను ఆమె దినేష్ కుమార్ కు ఇచ్చింది. వాట్సాప్ తదితర యాప్ లు డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని ఆమె దినేష్ కుమార్ కుమార్ కు చెప్పింది. ఇదే మంచి చాన్స్ అనుకున్న దినేష్ కుమార్ ఆ మొబైల్ లో ట్రాక్ వ్యూ అనే యాప్ ను డౌన్ లోడ్ చేశాడు.

బ్లాక్ మెయిల్ చేశాడు

బ్లాక్ మెయిల్ చేశాడు

వరసకు సోదరి అయ్యే మహిళ మొబైల్ ఫోన్ ను తన సెల్ ఫోన్ తో కంట్రోల్ చేసే విధంగా దినేష్ కుమార్ టెక్నాలజీ ఉపయోగించాడు. ఆమె భర్తతో మాట్లాడే రహస్యాలు, వీడియోలు, ఫోటోలు తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని ల్యాప్ ట్యాప్ లో భద్రపరిచాడు. వరసకు సోదరి అయ్యే మహిళతో మాట్లాడిన దినేష్ కుమార్ తనకు లైంగిక కోరిక తీర్చకుంటే నీ రహస్యాలు అన్నీ సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ చేశాడు.

బంధువులకు షాక్

బంధువులకు షాక్

దినేష్ కుమార్ వేధింపులు తట్టుకోలేని మహిళ సోదరుడికి విషయం చెప్పింది. సోదరుడి సూచనమేరకు ఓ ప్రాంతానికి వస్తే మనం ఏకాంతంగా కలుసుకుందామని దినేష్ కుమార్ కు మెసేజ్ పంపించింది. దినేష్ కుమార్ ఆ ప్రాంతానికి వెళ్లడంతో అతని బంధవులు షాక్ కు గురైనారు. వెంటనే దినేష్ కుమార్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.

ల్యాప్ టాప్ లు, మొబైల్ లు

ల్యాప్ టాప్ లు, మొబైల్ లు

దినేష్ కుమార్ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు రెండు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు. దాదాపు 100 మంది మహిళల వ్యక్తి గత సమాచారం, రహస్యాలు, వారి ఫోటోలు, వీడియోలు అందులో దినేష్ కుమార్ భద్రపరిచాడని పోలీసులు గుర్తించారు.

బంధువులు, స్నేహితులు

బంధువులు, స్నేహితులు

బంధువులైన మహిళలు, స్నేహితుల సెల్ ఫోన్లు చూసినట్లుగా నటించిన దినేష్ కుమార్ అందులో ట్రాక్ వ్యూ యాప్ డౌన్ లోడ్ చేసి వారి వ్యక్తిగత సమాచారం సేకరించాడు. తరువాత వారిని బెదిరించి అనేక మంది మహిళల మీద అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సొంత చెల్లెలు ఫోటోలు

సొంత చెల్లెలు ఫోటోలు

బెదిరింపులకు లొంగని మహిళల వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు విదేశీయులకు విక్రయించాడని పోలీసులు అన్నారు. సొంత చెల్లెలు భర్తతో మాట్లాడిన వ్యక్తిగత సమాచారం, ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సైతం దినేష్ కుమార్ సేకరించాడని పోలీసులు అన్నారు. ఇలాంటి నీచుడిని ఉరి తియ్యాలని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రామనాథపురం పోలీసులు కేసు నమోదు చేసి దినేష్ కుమార్ ను విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+