తమిళనాడు 2017-18 భారీ బడ్జెట్: ఎంతంటే, ప్రజలపై పన్ను !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్నై: తమిళనాడు ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై భారం పడకుండా (పన్ను లేదు) భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలోని ప్రభుత్వం రూ. 1,75,293 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది.

బడ్జెట్ సమావేశంలో శశికళ ఆశయాల కోసం అంటూ పరువు తీశారు

Tamil Nadu Budget 2017-18: D Jayakumar presents tax-free budget despite falling revenues

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి డి. జయకుమార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. రూ. 1,59,363 కోట్లు ఆదాయం అంచనా వేయగా, రూ. 15,930 కోట్లు లోటు చూపించారు.

అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. ప్రజలను మోసం చెయ్యడానికి అంకెలగారడితో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.

శశికళకే ఝలక్: చెప్పకుండానే దినకరన్ పోటీనా, మండిపడిన చిన్నమ్మ !

ఆర్థిక మంత్రిగా జయకుమార్ కు ఎలాంటి అనుభవం లేదని, గుడ్డిగా లెక్కలు వేసుకుని ఎదో బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తమిళనాడు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని స్టాలిన్ విమర్శించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్ శశికళ ఆశయాల కోసం బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని పదేపదే చెప్పి విమర్శలపాలైనారు. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తమిళనాడులోని దేవాలయాల్లో ఉచిత అన్నదానం కోసం నిధులు కేటాయించినట్లే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu finance minister D Jayakumar on Thursday presented a tax-free budget for 2017-18, despite a falling tax revenue and increasing expenditure due to higher subsidies.
Please Wait while comments are loading...