చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీటు బెల్ట్ లేదని చితకబాదిన పోలీసులు: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని!

|
Google Oneindia TeluguNews

చెన్నై: సీటు బెల్ట్ పెట్టుకోలేదని ఓ కారు డ్రైవర్ మీద ట్రాఫిక్ పోలీసులు చెయ్యి చేసుకోవడంతో అతను ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగర శివార్లలో జరిగింది. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ప్రజలు పోలీసుల మీద తిరగబడ్డారు.

చెన్నై సిటీ పోలీసులు

చెన్నై సిటీ పోలీసులు

బుధవారం మద్యాహ్నం చెన్నై నగర శివార్లలోని పాత మహాబలిపురం రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు పరిశీలిస్తున్నారు. ఆ సందర్బంలో సెంథిల్ అనే వ్యక్తి కారులో అటువైపు వెళ్లారు. కారు నిలిపిన ట్రాఫిక్ పోలీసులు సీటు బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.

పోలీసుల అతి

పోలీసుల అతి

కారు డ్రైవర్ సెంథిల్ ఎదో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. ఏం తమాషా చేస్తున్నావా ? అంటూ కారు డోర్ తీసి డ్రైవర్ ను చితకబాది అపరాదరుసుం చెల్లించాలని దురుసుగా ప్రవర్తించారు.

 పెట్రోల్ పోసుకుని

పెట్రోల్ పోసుకుని

సీటు బెల్ట్ పెట్టుకోలేదని అందరి ముందు తన మీద పోలీసులు దాడి చేశారని ఆవేదనతో డ్రైవర్ సెంథిల్ కారు డిక్కిలో ఉన్న పెట్రోల్ తీసుకుని మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు మంటలు అదుపు చేసి అతన్ని కీలపాకు ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు పరార్

పోలీసులు పరార్

నిమిషాలతో ఈ తతంగం జరిగిపోవడంతో భయంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి పరుగు తీశారు. స్థానికులు గుమికూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పారు.

English summary
COPS beat a car driver for not wearing seat belt at OMR, chennai. Hurted car driver self immolated and hospitalised at Kilpauk hospital, public jumped into protest condemning police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X