జయలలితో కోమాలో లేరు ? క్లారిటీ ఇచ్చారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్యం కుదటపడుతుందని, అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందనవసరం లేదని తమిళనాడు సీనియర్ మంత్రి సి. పొన్నాయన్ అన్నారు.
ఆయన అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలిత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అపోలో, ఎయిమ్స్ వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అమ్మ జయలలిత కొలుకుంటున్నారని తెలుసుకున్నారు.

తరువాత బయటకు వచ్చిన సీనియర్ మంత్రి పొన్నాయన్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లు అమ్మ కోమాలో లేరని స్పష్టం చేశారు. అమ్మ కేవలం జ్వరంతో భాదపడుతున్నారని వైద్యులు చికిత్స చేస్తున్నారని అన్నారు. జయలలిత ఆరోగ్యం గురించి కొందరు లేని పోని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అమ్మ ఆరోగ్యం విషయంలో ఇష్టం వచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్న వారి మీద చెన్నై నగర పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారని, చట్టపరంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారని సీనియర్ మంత్రి సి. పొన్నాయన్ వివరించారు.












Click it and Unblock the Notifications