కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన జయలలిత
చెన్నై: యుపీఏలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఎన్డీఏలోని బీజేపీ సర్కారు అనుసరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత విమర్శించారు. పదేపదే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచుతున్నారని జయలలిత ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జయలలిత చెప్పారు. గత నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచారని గుర్తు చేశారు. వెంటనే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని జయలలిత డిమాండ్ చేశారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించకపోవడం దారుణమని విమర్శించారు. చమురు ధరల నియంత్రణను ఆయిల్ కంపెనీలకు అప్పగించడం తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు.
దీర్ఘకాలిక ఆర్థికాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.












Click it and Unblock the Notifications