సీఎం సీటు ఖాళీ చేసిన విజయ్.. దశాబ్దాల నాటి సంప్రదాయానికి స్వస్తి

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి, కానీ గురువారం నాటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా సాగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీజే జోసెఫ్ విజయ్ శాసనసభలో తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ప్రజాప్రతినిధులతో పాటు పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ సీటింగ్ వ్యవస్థను పక్కన పెట్టి, సిఎం కోసం ప్రత్యేకంగా కేటాయించే పీఠాన్ని వదిలి మంత్రుల సరసన ఆయన కూర్చోవడం సభలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఒక ముఖ్యమంత్రి తన హోదాను పక్కనబెట్టి మంత్రుల బెంచీలపై కూర్చోవడం తమిళనాడు శాసనసభ చరిత్రలోనే ఇది ప్రథమమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Tamil Nadu CM Joseph Vijay Breaks Decades-Old Assembly Tradition by Sitting With Ministers in Front Row

సిఎం సీటు ఖాళీ.. మంత్రుల మధ్యన విజయ్ ప్రత్యక్షం!

సాధారణంగా సభలో స్పీకర్ కుడి వైపున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా, కాస్త విశాలమైన కుర్చీ కేటాయిస్తారు. ఆయన పక్కనుంచే సీనియారిటీ ఆధారంగా మంత్రుల వరుస ప్రారంభమవుతుంది. అయితే గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన సమయంలో ముఖ్యమంత్రి విజయ్ తన అధికారిక సీటును వదిలి మంత్రులు కేఏ సెంగోట్టయ్యన్, ఆధవ్ అర్జునల మధ్య ఉన్న స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు.

తోటి మంత్రులతో అత్యంత సాధారణంగా కలిసిపోతూ సభా వ్యవహారాలను గమనించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. తమ సమస్యలు, ఆలోచనలను పంచుకోవడానికి సాధారణ ఎమ్మెల్యేలు లేదా మంత్రులు తాత్కాలికంగా స్థానాలు మారడం చూస్తుంటాం, కానీ ఒక సీఎమే స్వయంగా దిగిరావడం ఎవరూ ఊహించలేదు.

ప్రధాని రేసులో విజయ్ దూకుడు.. మహామహానేతలను వెనక్కి నెట్టిన TVK అధినేత!
ప్రధాని రేసులో విజయ్ దూకుడు.. మహామహానేతలను వెనక్కి నెట్టిన TVK అధినేత!

అసెంబ్లీలో వాడివేడిగా 'వార్ రూమ్' వివాదం

అంతకుముందు రోజు ఉదయం సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అధికారుల హాజరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తమ డీఎంకే ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాఖల కార్యదర్శులు కూడా సభలోనే ఉండేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం సభలో ముఖ్యమంత్రితో పాటు ముఖ్య అధికారులు ఎవరూ కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.

దీనికి మంత్రి ఆధవ్ అర్జున బదులిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న వార్ రూమ్‌లో ఉంటూ సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత విజ్ఞప్తితో ఏకీభవించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. ఇకపై సభ జరుగుతున్నప్పుడు సీనియర్ అధికారులు ఖచ్చితంగా అసెంబ్లీలోనే ఉండేలా చూస్తామని హాజరైన సభ్యులకు హామీ ఇచ్చారు.

డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజులు నీటి విడుదల!
డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజులు నీటి విడుదల!

ప్రజాసేవే ముఖ్యం.. తగ్గిన హోదా భారం!

ఉదయం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ముఖ్యమంత్రి విజయ్ కొంత ఆలస్యంగా అసెంబ్లీకి చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే సభలో నెలకొన్న పరిస్థితులు, అధికారుల హాజరుపై జరిగిన చర్చల నేపథ్యంలో ఆయన నేరుగా మంత్రుల మధ్యకు వచ్చి కూర్చోవడం ఆసక్తి రేపింది.

ప్రభుత్వం, సభ నిర్వహణలో మరింత సమన్వయం పెంచడానికి, అందరినీ కలుపుకుని పోవడానికే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా, ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి సాధారణ మంత్రులలో ఒకరిగా మారిపోవడం తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+