Stalin: తమిళనాడు సీఎం కాబోయే ప్రధాని, తండ్రికి తగ్గ తనయుడు, ఫరూఖ్ కామెంట్స్ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కాబోయే ప్రధాన మంత్రి, ఆయనకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కు ఏరైంజ్ లో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. కాలేజ్ లో చదువుతున్న కుమార్తె ఉన్న ఓ మహిళ తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ తో మాట్లాడుతూ సార్ మీరు ఈ వయసులో ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడగడంతో అందరూ షాక్ అయ్యారు. తమిళనాడు సీఎం అయిన తరువాత ఎంకే. స్టాలిన్ మార్క్ పరిపాలన ఆ రాష్ట్రంలో కొనసాగుతోంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడిగా కాకుండా డీఎంకే నాయకుడిగా ఎంకే. స్టాలిన్ తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి కుమారుడిగా అందరిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తరువాత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లి సీఎం అయిన తరువాత ఎంకే. స్టాలిన్ ఆయన మార్కు రాజకీయాలు చెయ్యడం మొదలుపెట్టారు. తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ తిరుగులేని నాయకుడిలా ఎదిగారు అంటే అది ఆయనపడిన కష్టం అని చెప్పాలి.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కాబోయే ప్రధాన మంత్రి, ఆయనకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ ఏకం అయితే తమిళనాడు సీఎం ఎంకే, స్టాలిన్ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
తమిళనాడులోని ప్రభుత్వ తీరును దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు. ఆయా రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారని, తండ్రి కరుణానిధికి తగ్గ తనయుడిగా ఎంకే. స్టాలిన్ ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని ఫరూఖ్ అబ్దుల్లా కొనియాడారు. తమిళనాడులో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న డైనమిక్ సీఎం ఎంకే. స్టాలిన్ ప్రధాని అయితే మాత్రం చరిత్ర తిరగరాస్తారని తమిళ ప్రజలు అంటున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా మాటలు నిజం అవ్వాలని, అలాగే ఆదేవుడు కూడా ఆశీర్వదించాలని, అప్పుడే మా నాయకుడు స్టాలిన్ కచ్చితంగా ప్రధాన మంత్రి అవుతారని డీఎంకే పార్టీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications