శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్ !

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ బాధ్యతలు స్వీకరిస్తే మెరీనా బీచ్ వేదికగా మరో ఉద్యమం రాజుకునేనా అన్న ఉత్కంఠ తమిళనాడులో ఏర్పడింది. పన్నీర్ సెల్వంకు ఇప్పటికే సోషల్ మీడియాలో లక్షలాది మంది యువకులు మద్దతు ఇచ్చారు.

అయితే ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని శశికళ ప్రయత్నిస్తే మెరీనా వేదికగా మరో ఉద్యమం చేపట్టాలని తమిళనాడులోని పలు విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏలా పోరాటం చేశామో అలాగే సమర్థవంతమైన సీఎం కోసం మళ్లీ పోరాటం చెయ్యడానికి సిద్దం అంటున్నారు.

ఇప్పటికే శశికళ సీఎం కావడాన్ని సోషల్ మీడియాలో తప్పుపడుతూ వస్తున్న యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. అయితే అవేవీ పట్టనట్లు శశికళ కేవలం అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని తీరికలేకుండా ప్రయత్నిస్తున్నారు.

Tamil Nadu CM Panneerselvam becomes a hero for netizens after his Marina declaration

ఇదే జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని తమిళనాడుకు చెందిన యువకులు, విద్యార్థులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని శశికళ సీఎం అయ్యి తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

శశికళ సీఎం అయితే తమిళనాడు ప్రజలతో పాటు యువకుల జీవితాలు అందకారంలోకి వెళ్లిపోతాయని ఆరోపిస్తున్నారు. అవసరమైతే మేము మళ్లీ పోరాటానికి సిద్దంగా ఉన్నామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యక్షంగానే శశికళను వ్యతిరేకిస్తున్న యువత సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+