స్కూల్ పిల్లలకు కేకులు, గ్రీటింగ్ కార్డులు పంచిన సీఎం విజయ్

తమిళనాడు ప్రభుత్వం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పిల్లలకు కేకులు, గ్రీటింగ్ కార్డులు పంపిణీని ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు. స్వయంగా ఆయనే పలువురు పాఠశాల విద్యార్థులకు ఈ కానుకలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

తన సొంత నియోజకవర్గం చెన్నై పెరంబూర్ లో విజయ్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన మొత్తం 61,84,566 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల పట్ల ఆకర్షితులను చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పండుగ వాతావరణంలో ప్రతి చిన్నారికి స్వీట్లను అందించేలా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేసింది.

Tamil Nadu CM Vijay distributes cakes greeting cards to school students as part of Children s Day

విద్యార్థులందరికీ ఒకే రోజున ఈ కానుకలు అందేలా విద్యా శాఖ ప్రణాళికను రూపొందించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కేకుల సరఫరా వేగంగా జరిగేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొని పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ తరహా కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, డ్రాపౌట్స్ తగ్గుతాయని ప్రభుత్వం అంచనావేస్తోంది.

అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..
అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

విజయ్ ఆదేశాల మేరకు ఈ భారీ పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 9.27 కోట్ల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేసింది. పంపిణీకి అవసరమైన కేకులను తమిళనాడు పౌర సరఫరాల సంస్థ బహిరంగ టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేసింది. దేశంలోనే పేరుగాంచిన నాలుగు ప్రధాన బేకరీ ఉత్పత్తుల తయారీదారుల నుండి ఈ కేకులను సేకరించింది.

బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్
బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్

చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కఠినమైన జాగ్రత్తలు తీసుకుంది. ఈ విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను నూటికి నూరు శాతం పాటించారు. సరఫరాకు ముందే ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనరేట్ అధికారులు కేకుల శాంపిళ్లను క్షుణ్ణంగా పరీక్షించి, నాణ్యతా ధృవీకరణ పత్రాలు జారీ చేసిన తర్వాతే పాఠశాలలకు పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగడానికి వివిధ శాఖల అధికారులతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, జిల్లా, మండల విద్యాధికారులు, పౌర సరఫరాల సంస్థ రీజినల్ మేనేజర్లకు ఈ బాధ్యత అప్పగించారు. పదార్థాలు నిల్వ చేసే ప్రదేశాలు పురుగులు లేకుండా, పూర్తి పరిశుభ్రంగా ఉండేలా తగిన నివారణ చర్యలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+