సీఎంవోనా ? సినిమా స్పాటా ? సీఎం విజయ్ షాకింగ్ వీడియో..!

తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని కంగు తినిపించి, నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ (CM Vijay) ఇప్పుడు అన్ని విధాలుగా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని నిర్ణయాలు శభాష్ అనిపించుకుంటుండగా.. మరికొన్ని మాత్రం విమర్శల పాలవుతున్నాయి.

శభాష్ విజయ్..! తమిళనాట అమ్మ క్యాంటీన్లపై కీలక నిర్ణయం..!
శభాష్ విజయ్..! తమిళనాట అమ్మ క్యాంటీన్లపై కీలక నిర్ణయం..!

ఇవాళ విజయ్ అధికారులతో తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను ఏకంగా ఆడియోతో పాటు షూట్ చేయించి విడుదల చేయించారు. ఈ వీడియోలో సీఎం విజయ్ తో పాటు తమిళనాడు సీఎంవోలోని పలువురు కీలక అధికారులు ఉన్నారు. వారంతా విజయ్ తో ఏదో అంశంపై చర్చిస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అయితే సాధారణంగా సీఎం, మంత్రుల స్ధాయిలో ఉన్న వారు ఇలా సమీక్షలు చేసిన వీడియోలు వరకూ రిలీజ్ చేస్తారు కానీ ఇప్పుడు విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆడియోతో పాటు ఈ వీడియో రికార్డ్ చేయించి విడుదల చేయించారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tamil Nadu CM Vijay Official Review Video Goes Viral Triggers Mixed Response on Social Media
విజయ్ మరో షాకింగ్..! రాజీవ్ గాంధీ హంతకుడికి ఇలా ..!
విజయ్ మరో షాకింగ్..! రాజీవ్ గాంధీ హంతకుడికి ఇలా ..!

విజయ్ ఇలా వీడియో రిలీజ్ చేయడంపై జనంలో, ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు విజయ్ పారదర్శక పాలన చేస్తున్నట్లు చూపించందుకు ఇలా ఆడియోతో సహా తన సమీక్ష వీడియోను రిలీజ్ చేసి ఉంటారని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం సీఎం అయినా విజయ్ కు సినిమా అలవాట్లు పోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తగినట్లుగానే విజయ్ షూట్ చేయించి రిలీజ్ చేయించిన ఈ వీడియో సాధారణ షూటింగ్ వీడియోలా కాకుండా ఏదో రీల్ వీడియోలా అటు, ఇటూ కెమెరా తిప్పుతున్నట్లు ఉంది. దీంతో విజయ్ ఏదో విధంగా వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+