నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)

చెన్నై: తమిళనాడులో నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఇదే మంచి సందర్బం అని భావించిన ఓ పోలీసు అధికారి మహిళా ఎస్ఐతో అసభ్యంగా ప్రవర్తించి ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు.

మహిళా ఎస్ఐ శరీరం మీద తాకరాని చోట తాకిన సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరు ఏసీపీ జయరామ్ ఓ మహిళా ఎస్ఐ చాతి మీద చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

కోయంబత్తురులో నీట్ పరీక్షను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. ఈ సందర్బంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులను అధిక సంఖ్యలో అక్కడికి తరలించారు. ఆందోళన సృతి మించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

ఆ సందర్బంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే మంచి చాన్స్ అంటూ ఏసీపీ జయరామన్ ఓ మహిళా ఎస్ఐ చాతి మీద చెయ్యి వేసి తాకరాని చోట చెయ్యి పెట్టి అభ్యంతరకరంగా ప్రర్తించాడు. ఆ సందర్బంలో ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏసీపీ జయరామన్ మీద తమిళనాడు హోం శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆందోళనకారులను అదుపు చేసినట్లు నటించిన ఏసీపీ జయరామన్ ఓ మహిళా పోలీసు అధికారిని నడిరోడ్డులో అవమానించారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+