జనం లేరని ఫోటో తీశాడు..! జర్నలిస్టును చితకబాదిన కాంగ్రెసోళ్లు (వీడియో)

చెన్నై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని పార్టీల సమావేశాలకు జనం కరువవుతున్నారు. అదే క్రమంలో తమిళనాడులో కాంగ్రెస పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పెద్దగా జనం రాలేదు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న జర్నలిస్ట్.. ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలను ఫోటో తీశాడు. అది గమనించిన కాంగ్రెస్ శ్రేణులు కోపంతో ఊగిపోయారు. సదరు జర్నలిస్ట్ పై దాడికి దిగారు.

తమిళ్ వీక్లీ మ్యాగజైన్ కు చెందిన జర్నలిస్ట్ ముత్తురాజ్.. విరుదు నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభ కవరేజీకి వెళ్లారు. ఆ సమయంలో జనాలు పెద్దగా రాకపోవడం.. కుర్చీలు ఖాళీగా ఉండటంతో ఫోటో తీశాడు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు సహచరులు.

Tamil Nadu Congress workers beaten journalist for taking photos of empty chairs at party meeting

సదరు జర్నలిస్టును కాపాడేందుకు తోటి పాత్రికేయులు అడ్డుపడ్డారు. అయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు శాంతించలేదు. దాంతో అటు జర్నలిస్టులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీయడంతో పలువురు పాత్రికేయులకు గాయాలయ్యాయి. ఈ సభకు తమిళనాడు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేఎస్ అళగిరి హాజరుకావాల్సి ఉంది. జనాలు రాకపోవడంతో సభ ప్రాంగణం వెలవెలబోయింది. అయితే ఈ ఘటనపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు గుండాల్లా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+