జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ను ఆర్ కే నగర్ నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, పన్నీర్ సెల్వం సీఎం అయితే ఆయన మంత్రి వర్గంలో దీపాకు స్థానం కల్పించాలని,
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా తయారైనాయి. జయలలిత కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్ కు దూరంగా పెట్టడంలో ఇంత కాలం చక్రం తిప్పిన చిన్నమ్మకు అమ్మ కుటుంబ సభ్యులతోనే శశికళ అండ్ కోకు బుద్ది చెప్పిస్తామని అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు అంటున్నారు.
పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తో చర్చలు జరుపుతున్నారు. జయలలిత ప్రాథినిత్యం వహించిన చెన్నైలోకి ఆర్ కే నగర్ నుంచి దీపాను బరిలో దించాలని, ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పన్నీర్ సెల్వం వర్గీయులు భావిస్తున్నారు.

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు అన్నాడీఎంకే పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాంకుడా పన్నీర్ సెల్వం సీఎం అయితే ఆయన మంత్రి వర్గంలో దీపాకు స్థానం కల్పించాలని, అమ్మ వారసురాలిగా దీపాకు సముచిత స్థానం కల్పించి మంత్రి పదవి ఇచ్చి ప్రజల మద్దతు తీసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గీయులు నిర్ణయించారు.
జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో దీపాను ఒక్క సారి లోపలికి అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారు. కనీసం జయలలిత పార్థీవదేహం దగ్గర ఒక్క నిమిషం ఉండనివ్వకుండా ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. ఇలా జయలలిత కుటుంబ సభ్యులను శశికళ అడ్డుకుంటూ వచ్చి అవమానించారని ప్రజలు మండిపడుతున్నారు.
జయలలిత మరణించిన తరువాత దీపా జయకుమార్ మీడియా ముందు శశికళ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం జయమేనకోడలు దీపాను దగ్గరకు తీసుకుని పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించారు.
అమ్మ జయలలిత వారుసులకు అన్నాడీఎంకే పార్టీలో గుర్తింపు ఇచ్చామని ప్రజలకు చాటి చెప్పి శశికళకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఇక పన్నీర్ సెల్వం అధికారికంగా ఈ విషయం చెప్పాల్సి ఉంది. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చి శశికళ మీద పోటీ చేస్తానని దీపా జయకుమార్ ఇప్పటికే చెప్పారు.
ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని ఆ నియోజక వర్గం ప్రజలు ఇప్పటికే దీపా జయకుమార్ కు మనవి చేశారు. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దీపా జయకుమార్ ఇంటి దగ్గరకు ప్రతి రోజూ అన్నాడీఎంకే కార్యకర్తలు వెలుతూనే ఉన్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం దీపాకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications