Liquor ATM: మందు బాబులకు శుభవార్త.. అందుబాటులోకి లిక్కర్ ఏటీఎంలు..!
మీ డబ్బుల ఏటీఎం చూశారు.. వాటర్ ఏటీఎం చూశారు.. గోల్డ్ ఏటీఎం కూడా చూశారు. కానీ మీరు లిక్కర్ ఏటీఎం చూశారా.. ఇక నుంచి లిక్కర్ ఏటీఎం కూడా చూడబోతున్నారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) చెన్నై మాల్‌లోని ఎలైట్ స్టోర్‌లో అటానమస్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని మొదటగా చెన్నైలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. ఈ సౌకర్యం అంతట అందుబాటులోకి వస్తే మందుబాబులకు ఎనీ టైమ్ మందు దొరుగుతుంది.
ఇరవై నాలుగు గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మెషిన్లను తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ అవి సక్సెస్ అయితే మిగతా చోట్లు కూడా లిక్కర్ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వమే నడిపిస్తోంది. మందుల బాబుల సౌకర్యర్థం మద్యం బాటిల్స్ కోసం గంటల తరబడి వేచి ఉండే పనిలేకుండా.. కోక్, పెప్సీల సీసాలను ఓ పెద్ద ఫ్రిడ్జ్ నుంచి ఎలా కొనుగోలు చేస్తామో.. మందు కూడా అలానే కొనుగోలు చేసేలా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మిషన్ ఏర్పాటు చేసింది.

వినియోగదారుడు ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్ డిస్ ప్లేను చేయితో తాకితే ఒక మెను కనిపిస్తుంది. వినియోగాదారుడు ఆ మెనులో తనకు నచ్చిన మద్యాన్ని ఎంచుకోవచ్చు. మద్యం ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఎన్ని కావాలో అడుగుతుంది. మనం నంబర్ ఎంటర్ చేయగానే డబ్బు చెల్లించే ఆప్షన్ కనిపిస్తోంది. డబ్బులను ఆన్‌లైన్‌లో లేదా నగదు రూపంలో చెల్లించవచ్చు. మనీ పే చేసిన అనంతరం మనం ఎంచకున్న మద్యం బాటిల్స్ బయటకు వస్తాయి.
ప్రస్తుతం ఈ లిక్కర్ ఏటీఎంలు కోయంబేడు సమీపంలోని వీఆర్‌మాల్, టెన్ స్క్వేర్ మాల్, రాయపేట ఎక్స్‌ప్రెస్ అవెన్యూ, వేళచ్చేరి ఫినిక్స్‌మాల్ తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులు తమకు నచ్చిన మద్యం బాటిల్ ధరను మెషిన్‌లో చెల్లించి నచ్చిన బాటిల్ కొనుగోలు చేస్తున్నారు. మాల్స్‌లోని ఏర్పాటు చేసిన ఈ వెండింగ్ మెషీన్లలో ఉదయం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications