గవర్నర్‌తో డీజీపీ భేటీ: శశికళ బంధించిన ఎమ్మెల్యేల గురించి ఆరా!

తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి పదవి-పార్టీలో ఆధిపత్యం కోసం ఇటు పన్నీరు సెల్వం, అటు శశికళలు ప్రయత్నాలు చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి పదవి-పార్టీలో ఆధిపత్యం కోసం ఇటు పన్నీరు సెల్వం, అటు శశికళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యేలను బంధించడం చర్చనీయాంశమైంది.

గవర్నర్‌తో డీజీపీ భేటీ

తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుతో శుక్రవారం ఉదయం డీజీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన చర్చించారు. అనంతరం రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరిగిందని తెలుస్తోంది.

రిసార్టులలోని ఎమ్మెల్యేల భద్రత గురించి గవర్నర్ ఆరా తీశారు. అనంతరం డిజిపి ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టులకు వెళ్లనున్నారు. కాగా, శశికళ బందించిన ఎమ్మెల్యేలను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని పిఎంకే గురువారం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఇరువురు కలిశారు

ఇరువురు కలిశారు

ఉత్కంఠకు తెరదించుతూ... విద్యాసాగర రావు గురువారం చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే. సాయంత్రం ఐదు గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, రాత్రి ఏడున్నరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళలు రాజ్‌భవన్‌లో ఆయనను కలిశారు.

సమీక్ష

సమీక్ష

ఇరువర్గాలతో సాగిన భేటీ వివరాలపై కేంద్రానికి ఆయన నివేదించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌, డీజీపీ రాజేంద్రన్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను సమీక్షించారు.

న్యాయకోవిదులతో సంప్రదింపులు

న్యాయకోవిదులతో సంప్రదింపులు

మరోవైపు గవర్నరు విద్యాసాగర్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పరిణామాలను భేరీజు వేస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై న్యాయకోవిదులతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.

ఎవరికి అవకాశం?

ఎవరికి అవకాశం?

పన్నీర్‌ సెల్వం, శశికళలు కలిసిన తర్వాతా రాజ్ భవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన ఎలాంటి వైఖరి అనుసరిస్తారు? బల నిరూణకు పన్నీర్‌ సెల్వంకు అవకాశమిస్తారా? ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+