ఏపీని బ్యాన్ చేసిన సీఎం విజయ్, కర్ణాటకు షాక్.. రంగంలోకి కేరళ ముఖ్యమంత్రి!

ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో పెరుగుతున్న భవన నిర్మాణ, మౌలిక వసతుల అవసరాలను సాకుగా చూపిస్తూ.. రాళ్లు, ఎమ్-శాండ్, మెటల్ జెల్లీ వంటి కీలక నిర్మాణ సామగ్రిని ఇతర రాష్ట్రాలకు తరలించడంపై మూడు నెలల పాటు కఠిన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై ఈ నిర్ణయ ప్రభావం తీవ్రంగా పడనుండగా.. పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలకు మాత్రం మినహాయింపునిచ్చారు.

రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతుండటంతో పాటు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా రాతి ఉత్పత్తులు తమిళనాడులోని క్వారీల నుంచి లభించడం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీగా సామగ్రి తరలిపోవడం వల్ల స్థానికంగా కృత్రిమ కొరత ఏర్పడి, ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. స్థానిక ప్రాజెక్టులు ఆగిపోకుండా చూడటానికే ఈ తాత్కాలిక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

Tamil Nadu Imposes Three-Month Ban on Transporting Construction Materials to Kerala AP and Karnataka

సరిహద్దుల్లో పహారా.. ఉల్లంఘిస్తే అంతే!

నిషేధాజ్ఞలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు విజయ్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు తీవ్రతరం చేయాలని సూచించింది. చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నిస్తే తమిళనాడు అక్రమ మైనింగ్ రవాణా నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, వాహనాలను జప్తు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

లబోదిబోమంటున్న కేరళ: విజ్ఞప్తి చేసిన సీఎం

తమిళనాడు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో పొరుగున ఉన్న కేరళ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, తెంకాసి జిల్లాల నుంచి కేరళలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిత్యం రాతి సామగ్రి సరఫరా అవుతుంటుంది. ఈ రవాణా నిలిచిపోవడంతో నేషనల్ హైవే పనులు, విజింజం పోర్టు, వల్లార్‌పాడమ్ ప్రాజెక్టుల విస్తరణ దెబ్బతింటుందని కేరళ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తమ రాష్ట్రానికి వచ్చే సామగ్రికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రికి సత్వర లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+