నా కాళ్లు పట్టుకుంటే టీటీవీ దినకరన్ కు ఆ పదవి వచ్చింది: మంత్రి సంచలన వ్యాఖ్యలు !

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశయాలను తాము నేరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడమని, అమ్మ పేద ప్రజల కోసం ఏం చెయ్యాలనుకున్నారో అన్నీ పూర్తి చేస్తామని తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ అన్నారు.

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశయాలను తాము నేరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడమని, అమ్మ పేద ప్రజల కోసం ఏం చెయ్యాలనుకున్నారో అన్నీ పూర్తి చేస్తామని తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ అన్నారు.

కొందరు ప్రభుత్వాన్ని కూల్చుతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అలాంటి వారికి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు తరిమికోట్టి తగినబుద్ది చెబుతారని పరోక్షంగా టీటీవీ దినకరన్ వర్గాన్ని మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హెచ్చరించారు.

Tamil Nadu minister Dindigul Srinivasan slams TTV Dinakaran

శశికళ కాళ్లు పట్టుకుంటే నాకు మంత్రి పదవి వచ్చిందని పలువురు పాడుకూతలు కూస్తున్నారని మండిపడిన దిండుగల్ శ్రీనివాసన్ అమ్మ జయలలిత ఆశీస్సులతోనే నాకు మంత్రి పదవి వచ్చిందని స్పష్టం చేశారు. టీటీవీ దినకరన్ కు అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి ఎలా వచ్చిందో కూడా ఆయన మీడియా ముందు వివరించారు.

మంత్రి అయిన తన దగ్గరకు వచ్చిన టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో ఓ పదవి ఇవ్వాలని నా కాళ్లు, మరో మంత్రి సెంగోట్టయన్ కాళ్లు పట్టుకున్నారని, ఎడప్పాడి పళనిసామితో సహ పార్టీలోని నేతలతో చర్చించి నేను అతనికి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించానని దిండుగల్ శ్రీనివాసన్ బాంబు పేల్చారు. శశికళకు నమ్మినబంటు అయిన దిండుగల్ శ్రీనివాసన్ దినకరన్ మీద సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో మన్నార్ గుడి వర్గీయులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+