కర్ణాటక vs తమిళనాడు, బెంగళూరు తాగునీటి కోసం ఢిష్యూమ్ ఢిష్యూమ్, డీకేకి వార్నింగ్ !
బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తమిళనాడుతో పేచీ పెట్టుకోవడంతో కలకలం రేపింది. వివాదాస్పదంగా మారిన మాకేదాటు ప్రాంతంలో కావేరి నదికి అడ్డంగా డ్యామ్‌ను నిర్మించడాన్ని కర్ణాటక ప్రభుత్వానికి తాము ఎప్పటికీ అనుమతి ఇవ్వమని తమిళనాడు జలవనరుల శాఖా మంత్రి దొరై మురుగన్ తేల్చి చెప్పారు.
తమిళనాడుముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విపక్షాలు విరుచుకుపడిన నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటన కలకలం రేపింది. కర్ణాటక నాయకులు ఏదైనా చెప్పగలరు. మేకదాటు డ్యామ్ నిర్మిస్తామని కర్ణాటక డీసీఎం చెబుతున్నారు, మమ్మల్ని ఎవరూ ఆపలేరని ఆయన అంటున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ గిమ్మిక్కులే, మేకదాటు ప్రాజెక్టుకు మేము ఎప్పటికీ అనుమతించమని, డీకే శివకుమార్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని దొరైమురుగన్ మండిపడ్డారు.

మేకదాటు రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమై చర్చించినట్లు మీడియా ద్వారా తెలిసిందని తమిళనాడు మంత్రి దొరై మురుగన్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రణాళిక సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, దీనికి ఎప్పటికీ అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంలోనే చెప్పారని దొరైమురుగన్ గుర్తు చేశారు.
త్వరలో ఢిల్లీలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తమిళనాడు మంత్రి దొరైమరుగన్ తెలిపారు. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈ అంశంపై చర్చించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడల్లా మేకదాటు డ్యామ్‌పై కర్ణాటక ప్రభుత్వ వాదనలను వినిపిస్తోందని తమిళనాడు మంత్రి దురై మురుగన్ అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీకే శివకుమార్ మేకేదాటు సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించడమే కాకుండా కేంద్రమంత్రికి లేఖ కూడా రాశారని తమిళనాడులోని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి ఆరోపించారు. మే నెలలో మేకదాటు డ్యామ్‌పై డీకే. శివకుమార్ అధికారులతో సమావేశం నిర్వహించినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను అని తమినాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
కీలుబొమ్మగా మారిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఆ రోజు తగిన సమాధానం ఇచ్చి ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ తదుపరి చర్యలు తీసుకునేవారు కాదని ఏఐఏడీఎంకే ఆరోపించింది. సామరస్యంగా జీవిస్తున్న తమిళనాడు, కర్ణాటక ప్రజల మధ్య గందరగోళం సృష్టించేందుకు డీకే. శివకుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి చెందిన 38 మంది లోక్‌సభ ఎంపీలతో కలిసి ఢిల్లీకి చేరుకుని మేకదాటు నిర్మాణాన్ని ఆపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కోరారు.

బెంగళూరులో జరగనున్న జాతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఎంకే స్టాలిన్ పాల్గొంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లు అవుతుందని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. స్టాలిన్ బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా గో బ్యాక్ స్టాలిన్ అంటూ నిరసన చేపడుతామని అన్నామలై హెచ్చరించారు. దిగువ రాష్ట్రాల అంగీకారం లేకుండా మేకదాటు డ్యామ్ ప్రాజెక్టులు చేపట్టరాదన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని అన్నామలై అన్నారు.

మేకేదాటు అనేది కర్ణాటక ప్రతిపాదించిన బహుళ ప్రయోజన తాగునీరు మరియు విద్యుత్ ప్రాజెక్టు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని కనకపుర సమీపంలో రిజర్వాయర్‌ను నిర్మించడం. సుమారు రూ. 9,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే మేకదాటు ప్రాజెక్ట్ బెంగళూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. రైతుల జీవనాధారమైన కావేరీ జలాల్లో రాష్ట్ర వాటాపై ప్రభావం పడుతుందని తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి ఈ మేకదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications