కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు, నోరువిప్పిన మేడమ్, వాళ్లు పంపించాలని చెప్పారు!

చెన్నై: కాలేజ్ అమ్మాయిలు శారీరక సుఖం ఇస్తే డబ్బుతో పాటు మంచి మార్కులు వేయిస్తానని విద్యార్థినిలకు చెడుదోవ పట్టించడానికి ప్రయత్నించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని తమిళనాడు సీబీసీఐడి అధికారులు రెండో రోజూ విచారణ చేస్తున్నారు.

నిజాలు బయటకు

నిజాలు బయటకు

అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని విచారణ చేస్తున్నామని, అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయని సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి శనివారం స్థానిక మీడియాకు చెప్పారు. నిర్మలా దేవి వెనుక ఉన్న వారి అందరి బండారం త్వరలోనే బయటపడుతోందని సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి అన్నారు.

నోరు విప్పిన మేడమ్

నోరు విప్పిన మేడమ్

సీబీసీఐడి విచారణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి నోరువిప్పారని తెలిసింది. మదురై కామరాజర్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమ్మాయిలను సరఫరా చెయ్యాలని తన మీద ఒత్తిడి తీసుకు వచ్చారని నిర్మలా దేవి అంగీకరించారని సమాచారం.

కామాంధులు

కామాంధులు

మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కామాంధులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. నిర్మలా దేవి ఎక్కడ మా పేర్లు బయటకు చెబుతుందో అని అమ్మాయిలను సరఫరా చేయించుకోవడానికి ప్రయత్నించిన కీచక అధ్యాపకులు ఇప్పుడు హడలిపోతున్నారు.

పెద్దలను వదలం

పెద్దలను వదలం

నిర్మలా దేవి వ్యవహారంలో ఎంతటి పెద్దలు ఉన్నా వదిలిపెట్టమని తమిళనాడు ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఏర్పాటు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఏక సభ్య కమిషన్ విచారణ ముమ్మరం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+