Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్ భవన్‌పై పెట్రోల్ బాంబు దాడి: నిందితుడి అరెస్ట్

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్ భవన్‌పై పెట్రోల్ దాడి జరగడం కలకలం రేపింది. గిండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గవర్నర్ నివాసం మెయిన్ గేట్‌పై వినోద్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు విసిరేయడం వెనుక ఉన్న ఉద్దేశం తెలుసుకునేందుకు అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. అయితే, పెట్రోల్ బాంబు దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, నిందితుడు కేవలం ఒక పెట్రోల్ బాంబు మత్రమే ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.

Tamil Nadu: Petrol Bomb Hurled Outside Raj Bhavan, one Arrested

'బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌ వెలుపల బారికేడ్‌ల దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్‌ బాంబులను విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గమనించి.. వెంటనే అతడిని చుట్టుముట్టారు. అనంతరం అతడి చేతిలో ఇతర పెట్రోల్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేవు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ ​భవన్​ వద్ద సరైన బందోబస్త్ ఉంది. నిందితుడిని హిస్టరీ-షీటర్‌ కె వినోద్‌గా గుర్తించాం. అతడు ఓ నేరస్థుడు.. అతడిపై ఇప్పటికే 6 నుంచి 7 కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది' అని చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా తెలిపారు.

మూడు రోజుల క్రితం జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్​ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ​ఈ ఘటన తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ.. తమిళనాడు సర్కారుపై మండిపడింది. రాష్ట్రంలో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిని ఈ దాడి ప్రతిబింబిస్తుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై.

ఇది ఇలావుండగా, తమిళనాడులో గతేడాది ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. బీజేపీ ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరేశారు. ఈ దాడికి పాల్పడిన నేరస్థున్ని తప్పకుండా శిక్షించాలని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆ సమయంలో ఆరోపించారు అన్నమలై.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+