master plan: భార్య, అత్త తలలు అడ్డంగా నరికేశాడు, కోచింగ్ సెంటర్ల చుట్టూ భార్య రౌండ్స్, భర్త ఇంట్లో !

చెన్నై/ తిరుచ్చి/ మదురై: భార్య, భర్తల పంచాయితీలో నిత్యం అత్త జోక్యం చేసుకుంటోంది. సివిల్స్ పరీక్షలు రాయడానికి సిద్దం అవుతున్న భార్య రోజు సింగారించుకుని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతోంది. ఇంట్లో ఉంటున్న కుమార్తెను చూసుకుంటున్న భర్త కుటుంబ సమస్యలతో విసిగిపోయాడు. నువ్వు పద్దతి మార్చుకోవాలని, మనకు మన పాప ముఖ్యం అని భర్త భార్యకు చెప్పాడు. అంతలోనే అడ్డం దూరుతున్న అత్త అల్లుడు ఏంది నీ గిల్లుడు అంటూ రెచ్చిపోయింది. ఛీ ఏందీ జీవితం రోజు ఇదే పంచాయితీనా , ఏదో జరుగుతోంది అంటూ సహనం కోల్పోయిన భర్త అర్దరాత్రి భార్య, అత్త తలలను అడ్డంగా నరికేసి బిడ్డను ఎత్తుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

 పవిత్రబంధం

పవిత్రబంధం

తమిళనాడులోని తిరుచ్చిలోని నాయక్ స్ట్రీట్ లో ఉలగనాధన్ (35), పవిత్ర (30) దంపతులు నివాసం ఉంటున్నారు. ఉలగనాథన్, పవిత్ర దంపతులకు 3 ఏళ్ల కనిష్కా అనే కుమార్తె ఉంది. తిరుచ్చిలోని ఓ టైర్ కంపెనీలో ఉలగనాథన్ ఇంతకాలం ఉద్యోగం చూస్తూ భార్య పవిత్ర, కుమార్తె కనిష్కాను పోషిస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసిన ఉలగనాథన్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు.

 పవిత్ర తీరుపై భేజారు

పవిత్ర తీరుపై భేజారు

టీఎన్ పీఎస్ సీ (గ్రూప్ పరీక్షలు) రాయడానికి పవిత్ర సిద్దం అవుతోంది. తిరుచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ లో గ్రూప్ పరీక్షలు రాయడానికి పవిత్ర శిక్షణ తీసుకుంటున్నది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో స్నానం చేసి టిఫిన్ తిని రెఢీ అయ్యి కోచింగ్ సెంటర్ కు వెలుతున్న భార్య పవిత్ర సాయంత్రం ఇంటికి తిరిగి వస్తోంది. పవిత్ర తీరుపై భర్త ఉలగనాథన్ అసహనం పెంచుకున్నాడు. ఏదో జరుగుతోంది అంటూ భర్త భార్య పవిత్ర మీద అనుమానం పెంచుకున్నాడు.

 ప్రభుత్వ ఉద్యోగం టార్గెట్

ప్రభుత్వ ఉద్యోగం టార్గెట్

ఎలాగైనా తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాధిస్తానని, అంత వరకు నేను నిద్రపోనని పవిత్ర భర్త ఉలగనాథన్ కు తేల్చి చెప్పింది. అయితే పాప గురించి, నా గురించి పట్టించుకోవడం లేదని భర్త ఉలగనాథన్ భార్య పవిత్రతో గొడవ పెట్టుకుంటున్నాడు. కుమార్తె కనిష్కాకు ఇంకా మూడేళ్లు కూడా పూర్తి కాలేదని, అమ్మాయిని ఈ వయసులో పట్టించుకోకపోతే ఎలా ? అంటూ భర్త ఉలగనాథన్ భార్య పవిత్రతో గొడవ పెట్టుకుంటున్నాడు.

 అత్త ఎంట్రీతో కథ కొత్త మలుపు

అత్త ఎంట్రీతో కథ కొత్త మలుపు

కొన్ని రోజుల క్రితం కుమార్తె పవిత్ర, మనుమరాలు కినిష్కాని చూడటానికి ఉలగనాథన్ అత్త కలైసెల్వి తిరుచ్చికి వచ్చింది. నాయక్ స్ట్రీట్ లోని కుమార్తె పవిత్ర ఇంటిలోనే ఆమె తల్లి కలైసెల్వి ఉంటున్నది. రోజు కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న భార్య పవిత్రతో గొడవ పెట్టుకుంటున్న ఉలగనాథన్ పై అతని అత్త కలైసెల్వి మండిపడుతోంది. ఏం నాకూతురి మీద నీకు నమ్మకం లేదా ?, ఎందుకు పదేపదే గొడవ పడుతున్నావ్ అంటూ ఉలగనాథన్, పవిత్ర దంపతల మధ్యలో అత్త కలైసెల్వి జోక్యం చేసుకుంది.

 అర్దరాత్రి అత్త, భార్య తలలు నరికేశాడు

అర్దరాత్రి అత్త, భార్య తలలు నరికేశాడు

రాత్రి పొద్దుపోయే వరకు ఉలగనాథన్, అతని భార్య పవిత్ర గొడవ పడ్డాడు, మధ్యలో జోక్యం చేసుకున్న అత్త కలైసెల్వి రెచ్చిపోయింది. తరువాత పవిత్ర, ఆమె తల్లి కలైసెల్వి ఒక గదిలో నిద్రపోయారు. కుమార్తె కలిష్కాతో కలిసి ఉలగనాథన్ నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత పదునైన కొడవలి తీసుకున్న ఉలగనాథన్ నిద్రపోతున్న భార్య పవిత్ర, అత్త కలైసెల్విల తలలు నరికేశాడు. తలలు తెగిపోవడంతో పవిత్ర, ఆమె తల్లి కలైసెల్వి ప్రాణాలు అక్కడే పోయాయి.

 కూతురితో ఎస్కేప్

కూతురితో ఎస్కేప్

భార్య పవిత్ర, అత్త కలైసెల్విని హత్య చేసిన ఉలగనాథన్ కుమార్తె కనిష్కాను ఎత్తుకుని వేకువ జామున 4 గంటల సమయంలో ఇంటికి బయట తాళం వేసి పరారైనాడు. ఉలగనాథన్ కు ఆమె తల్లి ఇంద్రాణి ఫోన్ చేసింది. ఉలగనాథన్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. వెంటనే ఇంద్రాణి కోడలు పవిత్రకు ఫోన్ చేసింది. కోడలు కూడా ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో సమీపంలో నివాసం ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి ఇంటి దగ్గరకు వెళ్లి చూడాలని ఇంద్రాణి చెప్పింది.

 సౌండ్ రాకుండా చంపేశాడు

సౌండ్ రాకుండా చంపేశాడు

చుట్టుపక్కల వాళ్లు తలుపుకు బయట తాళం పగలగొట్టి చూడగా లోపల పవిత్ర, ఆమె తల్లి కలైసెల్వి తలలు తెగి శవమైకనిపించారు. విషయం తెలుసుకున్న తిరుచ్చి డిప్యూటీ పోలీసు కమిషనర్ పవన్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ తమిళమారన్ తదితరులు సంఘటనా స్థలంలో పరిశీలించి వివరాలు సేకరించారు. పవిత్ర తీరుపై అసహనంతో ఆమెను, కాపురంలో చిచ్చు రేపుతున్న అత్త కలైసెల్విలను ఉలగనాథన్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కుమార్తె కనిష్కతో కలిసి పరారైన ఉలగనాథన్ కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. పక్కింటి వాళ్లకు కూడా సౌండ్ రాకుండా భార్య, అత్తను హత్య చేసి భర్త పరారైన విషయం బయటకు రావడంతో తిరుచ్చిలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+