పగ, ప్రతీకారం: 60 మంది ఎంఎల్ఏలపై కేసులు
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్నఅన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే శాసన సభ్యుల మీద కొరడా ఝులిపించింది. ప్రతిపక్ష నేత స్టాలిన్ తో పాటు 60 మంది శాసన సభ్యుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
అధికార పార్టీ తమ మీద కక్షకట్టి ప్రతీకారంగా కేసులు నమోదు చేసిందని, అరెస్టు కావడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రతిపక్ష నాయకడు స్టాలిన్ అన్నారు. అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారని కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమయంలో స్టాలిన్ నమక్కునామే ప్రచారాన్ని నిర్వహించారు. ఈనెల 18వ తేది నాటి అసెంబ్లీ సమావేశాల్లో అన్నాడీఎంకే శాసన సభ్యుడు తిరుప్పూరు గుణశేఖర్ స్టాలిన్ నిర్వహించిన ప్రచారాన్ని ఎద్దేవ చేశారు.

స్టాలిన్ ను ఉద్దేశించి అన్నారు
ఆ సందర్బంలో డీఎంకే శాసన సభ్యలు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

డీఎంకే పై వేటు
అసెంబ్లీ సమావేశాలు సజవుగా నిర్వహించేందుకు డీఎంకే సభ్యులు సహకరించడం లేదని ఆరోపిస్తూ మంత్రి పన్నీర్ సెల్వం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆందోళనకు దిగిన డీఎంకే శాసన సభ్యులను ఏడు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు.

బలవంతంగా బయటకు
స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ స్టాలిన్ తో పాటు డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపించారు. ఆనాటి సమావేశాలకు హాజరుకాని డీఎంకే సభ్యులు అసెంబ్లీకి రావచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి.

అడ్డుకున్న సెక్యూరిటీ
ఈనెల 19వ తేదిన డీఎంకే శాసన సభ్యులు అసెంబ్లీలోకి వెళ్లి ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ చాంబర్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. డీఎంకే శాసన సభ్యులు అక్కడే ధర్నా నిర్వహించారు.

మాక్ అసెంబ్లి
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాక్ అసెంబ్లి నిర్వహించారు. డీఎంకే సీనియర్ శాసన సభ్యుడు దురైమురుగన్ స్పీకర్ గా వ్యవహరించారు. మాక్ అసెంబ్లీ నిర్వహించిన 40 మంది శాసన సభ్యులపై అదే రోజు కేసులు నమోదు చేశారు.

60 మంది మీద కేసులు
అయితే ఆదివారం మొత్తం 60మంది డీఎంకే శాసన సభ్యుల మీద కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా సచివాలయంలోకి ప్రవేశించారని కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

అరెస్టుకు సిద్దంగా ఉన్నాం
మా మీద బనాయించిన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని డీఎంకే సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ అన్నారు. అన్నాడీఎంకే ప్రతిపక్షం మీద వేధింపులకు పాల్పడుతున్నదని, అరెస్టు కావడానికి తాము సిద్దంగా ఉన్నామని స్టాలిన్ అన్నారు.

అధికారి పై బదిలీ వేటు
డీఎంకే శాసన సభ్యుల మీద కేసులు నమోదు చెయ్యడాన్ని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కు సహకరించాడని ఆరోపణలపై ప్యారిస్ ఫ్లవర్ బజార్ సహాయ కమిషనర్ శక్తివేల్ మీద బదిలీ వేటు పడింది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications