హిందీని మాపై రుద్దకండి: డీఎంకే ఆఫీసు ఎదుట సీనియర్ కార్యకర్త ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటు చోసుకుంది. రాష్ట్రంలోని సేలం జిల్లాకు చెందిన 85 ఏళ్ల రైతు, డీఎంకే కార్యకర్త హిందీ తప్పనిసరిని నిరసిస్తూ డీఎంకే కార్యాలయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
డీఎంకే మాజీ వ్యవసాయ సంఘం ఆర్గనైజర్ తంగవేల్ శనివరాం ఉదయం మెట్టూరు పక్కనే ఉన్న తలైయూర్‌లోని డీఎంకే పార్టీ కార్యాలయం ముందు హిందీని విధించడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు.
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తంగవేల్ అక్కడికక్కడే మృతి చెందారు. డీఎంకే క్రియాశీల సభ్యుడు, తంగవేల్ విద్యా మాధ్యమంగా హిందీని తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చెందారు.
ఆత్మాహుతి చేసుకోవడానికి ముందు, తంగవేల్ ఒక బ్యానర్ పట్టుకున్నారు. అ బ్యానర్‌లో.. "మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మాకు హిందీ వద్దు, మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష, హిందీ భాషని విధించడం విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. హిందీని వదిలించుకోండి, హిందీని వదిలించుకోండి, హిందీని వదిలించుకోండి' అని పేర్కొన్నారు.

తమిళనాడుపై హిందీని రుద్దితే దేశ రాజధానిలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన చేపడుతుందని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, సీఎం ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే హెచ్చరించారు.
కేంద్రప్రభుత్వం ప్రజల మనోభావాలను విస్మరిస్తే మౌనంగా ఉండబోమని ఆ పార్టీ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీల వంటి సాంకేతిక, సాంకేతికేతర ఉన్నత విద్యా సంస్థలలో బోధనా మాధ్యమం హిందీ.. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉండాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేయడంతో నిరసన చెలరేగింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications