వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంట్రీ: పన్నీరు వర్గంలో చేరిన దీపా, అద్భుతం జరిగితేనే..: శశికళ అలర్ట్

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోసారి జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. జయ మేనకోడలు దీపా జయకుమార్‌తో కలిసి ఆయన సమాధిని సందర్శించారు. దీపా.. ఇప్పుడు పన్నీరు గ్రూపులో చేరిపోయారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోసారి జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. జయ మేనకోడలు దీపా జయకుమార్‌తో కలిసి ఆయన సమాధిని సందర్శించారు. దీపా.. ఇప్పుడు పన్నీరు గ్రూపులో చేరిపోయారు.

పన్నీరుతో కలిసి పోవడంపై మీడియా ఆమెను ప్రశ్నించింది. రాజకీయ ఆరంగేట్రం చేశాారా అంటే అవునని సమాధానం చెప్పారు. ఇప్పటికే కోర్టు తీర్పుతో శశికళ చిక్కుల్లో పడ్డారు. దీప.. పన్నీరు వర్గంలో చేరడం ద్వారా చిన్నమ్మకు మరింత చిక్కులు అని చెప్పవచ్చు.

సీఎం పీఠంపై శశికళ మరో ఎత్తు: పన్నీరుకు ఉద్వాసన, తెరపైకి పళనిస్వామిసీఎం పీఠంపై శశికళ మరో ఎత్తు: పన్నీరుకు ఉద్వాసన, తెరపైకి పళనిస్వామి

తమిళ రాజకీయాలు సుప్రీం కోర్టు తీర్పుతో మరో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో శశికళ వర్గం శాసనసభా పక్ష నేతగా పళనిసామిని ఎన్నుకుంది.

సాయంత్రం ఆయన తన మద్దతుదారులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో చర్చించారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

మరోవైపు శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వం కూడా సీఎం పీఠంపై పట్టువీడడం లేదు. గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన తన రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటారన్న వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. అయితే అలా చేయడం సాధ్యమా? కాదా? అన్న దానిపై న్యాయనిపుణుల సలహా కూడా తీసుకుంటున్నారు.

O Panneerselvam

మరోవైపు శశికళకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఆమె వర్గంలోని ఎమ్మెల్యేలు పన్నీర్ వద్దకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పళనిసామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పన్నీర్‌ వద్ద ప్రస్తుతం ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు మాత్రమే.

శశికళ వర్గంకు చెందిన పళనిస్వామికే మెజార్టీ ఉంది. దీంతో పన్నీర్ కూడా తదుపరి వ్యూహాల రచనలో బిజీగా ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పన్నీర్ సీఎం కావడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

రాజకీయ నేతలకు గుణపాఠం: శశికళపై స్టాలిన్, స్వీట్లు పంచారురాజకీయ నేతలకు గుణపాఠం: శశికళపై స్టాలిన్, స్వీట్లు పంచారు

బలవంతంగా సంతకాలు సేకరించారు

గవర్నర్ విద్యాసాగర రావును పన్నీరు సెల్వం వర్గీయులు మైత్రేయన్, పీహెచ్ పాండియన్ కలిశారు. రిసార్టులో ఎమ్మెల్యేలతో బలవంతంగా శశికళ వర్గీయులు సంతకాలు తీసుకున్నారని, తమకే బలం ఉందని, పన్నీరును ఫ్లోర్ టెస్టుకు పిలవాలని వారు గవర్నర్‌ను కోరారని తెలుస్తోంది. తీర్పు అనంతరం పన్నీరు వ్యూహాలు రచిస్తుండగా.. శశికళ అలర్ట్‌గా ఉంటున్నారు. రిసార్టులో పళని స్వామి.. చిన్నమ్మను కలిసి గవర్నర్‌తో జరిగిన భేటీ వివరాలు వెల్లడించారు.

English summary
AIADMK's V Maitreyan and PH Pandian (O Panneerselvam supporters) leave after meeting Tamil Nadu Governor at Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X