విజయ్ చుట్టూ వల- నయానో, భయానో

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ షెడ్యూల్ జారీ చేయడానికి ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించింది. తేదీల ప్రకటనతో పాటు ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో కొత్త విధాన ప్రకటనలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ఆర్థికపరమైన వరాల గురించి వెల్లడించడానికి వీలుండదు.

Tamil Nadu voting date pushed back as Reportedly to provide Vijay extra time on NDA alliance talks

కాగా ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం కలిపి మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17.4 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 2.19 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది. అలాగే- 25 లక్షల మందికి పైగా ఎన్నికల సిబ్బందిని విధి నిర్వహణలో మోహరింపజేయనుంది. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్.

సాధారణంగా తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ, తమిళనాడు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ విడదీసింది. కేరళలో పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 23వ తేదీన తమిళనాడులో ఓట్లు జరుగనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రెండు వారాల పాటు గడువు ఉంది. ఇది రాజకీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

పొత్తుపై విజయ్ తో చర్చలు కొనసాగించడానికే బీజేపీ ఈ రెండు వారాల గడువును సాధించుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ గడువులో టీవీకేతో పొత్తు చర్చలు ముమ్మరం చేయాలనేది బీజేపీ వ్యూహంగా భావిస్తోన్నారు. ఎలాగైనా సరే.. ఆయనను ఒప్పించాలని పట్టుదలతో కమలనాథులు ఉన్నారనేది దీంతో మరోసారి స్పష్టమైనట్టే.

ఇప్పటికే ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు- టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తమిళనాడులో రాజకీయ, ఎన్నికల సమీకరణాలను గణనీయంగా మారిపోవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+