కన్నడిగుల మీద తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ దాడి, మా హీరో కటౌట్ చూస్తావా అంటూ ఫైర్ !
బెంగళూరులో కన్నడిగుల మీద తమిళ హీరో ఫ్యాన్స్ దాడిమా హీరో కటౌట్ చూస్తావా, ఎంత ధైర్యం అంటూ ఫ్యాన్స్ హల్ చల్హీరో విజయ్ సినిమా మెర్సల్ విడుదల సందర్బంగా గొడవ, కన్నడ సంఘాల ఆందోళన
బెంగళూరు: కన్నడ, తమిళ సోదరుల మధ్య మళ్లీ వివాదం మొదలైయ్యింది. ఒక్క తమిళ సినిమా విడుదల సందర్బంగా కన్నడిగ, తమిళ సోదరుల మధ్య మళ్లీ గొడవలు మొదలైనాయి. తమిళ సినీ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా విడుదల సందర్బంగా బెంగళూరులో గొడవ మొదలైయ్యింది.
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో విడుదలైయ్యింది. బెంగళూరు నగరంలోని సంపిగే థియేటర్ లో మెర్సల్ సినిమా విడుదలైయ్యింది. ఈ సందర్బంగా హీరో విజయ్ భారీ కటౌట్లు థియేటర్ ముందు ఏర్పాటు చేశారు.

మల్లేశ్వరంలో నివాసం ఉంటున్న కొందరు యువకులు సంపిగే థియేటర్ ముందు వెలుతూ తమిళ హీరో విజయ్ కటౌట్లు చూశారు. ఆ సందర్బంలో హీరో విజయ్ అభిమానులు మా హీరో, మా దేవుడు, మీరెందుకు కటౌట్లు చూస్తున్నారు అంటూ గొడవకు దిగారని సమాచారం.
ఆ సందర్బంలో మాటామాటా పెరగడంతో కన్నడిగుల మీద తమిళ హీరో విజయ్ అభిమానులు దాడి చేశారని కన్నడ మీడియాలో బుధవారం వార్తలు ప్రసారం అయ్యాయి. విషయం తెలుసుకున్న కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి. కర్ణాటకలో కన్నడిగుల మీద తమిళ హీరోల అభిమానులు ఎందుకు దాడులు చేస్తున్నారు, వెంటనే వారిని అరెస్టు చెయ్యాలని కన్నడ సంఘాలు ఆందోళకు దిగాయి.












Click it and Unblock the Notifications