రజనీకాంత్ రాజకీయపార్టీ: సన్నిహితులతో మంతనాలు?

చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన తన సన్నిహితులతో సమావేశమయ్యారని సమాచారం. అయితే ఇదే అనుకూలమైన సమయమని రజనీ అభిమానులు పార్టీ ఏర్పాటుపై రజనీపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం సాగుతోంది.

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని రజనీ అభిమానులు ఆయనకు సూచిస్తున్నారు. అయితే ఈ విషయమై రజనీ కూడ అనుకూలంగా ఉన్నారు.

Tamil super star Rajinikanth may launch his political party

తమిళ సూపర్ స్ఠార్ రజనీకాంత్ కు బిజెపి బంఫరాఫర్ ఇచ్చింది.అయితే తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కానుంది. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేయాలని అభిమానులు కోరుకొంటున్నారు.

అయితే తనకు పవర్ అంటే ఇష్టమని రజనీకాంత్ ఇటీవల కాలంలోనే వ్యాఖ్యానించారు.అయితే పవర్ అంటే ఇష్టమని రజనీకాంత్ ప్రకటించిన తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లోని పవర్ అంటేనే ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.

రజనీకాంత్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను బిజెపి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మేరకు బిజెపిలో చేరితే రజనీకాంత్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టనున్నట్టు కూడ హమీ ఇచ్చిందనే ప్రచారం తమిళనాడులో ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో, ప్రసారసాధనాల్లో ఇదే విషయమై ప్రచారం సాగుతోంది..అయితే తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బిజెపి ఇస్తోన్న ఆఫర్ పై అభిమానులతో రజనీకాంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయమై ఆయన తన సన్నిహితులు, అభిమానులతో చర్చిస్తున్నారని సమాచారం.

అయితే తమిళనాడు సినీ పరిశ్రమలోని ప్రముఖులు తాజా రాజకీయపరిస్థితులపై స్పందించారు.కాని, రజనీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎవరి పక్షం ఉంటారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇదే తరుణంలో రజనీ పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది. ఈ పరిణామాల దృష్ట్యానే రజనీ మౌనంగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతకర్త గురుమూర్తి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన రజనీకాంత్ కు లేదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+