ప్రేమ పెళ్లి, భార్యను చితకొట్టిన నటుడు, ఆస్తి పత్రాలు కుదవ పెట్టిన డబ్బుతో, దెబ్బకు చిప్పకూడు!

చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చితకబాదిన బుల్లితెర నటుడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తమిళ బుల్లితెర ప్రముఖ నటుడు ఈశ్వర్ రఘునాథన్ అలియాస్ రఘు అలియాస్ ఈశ్వర్, అతని తల్లిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి విచారణ చేస్తున్నామని చెన్నై నగర పోలీసులు తెలిపారు. నటుడు రఘునాథన్ దాడిలో తీవ్రగాయాలైన అతని భార్య ఐశ్వర్యకు గాయాలు కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు.

నటుడి ప్రేమ పెళ్లి

నటుడి ప్రేమ పెళ్లి

ఈశ్వర్ రఘునాథన్ జయశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈశ్వర్ రఘునాథన్, జయశ్రీ దంపతులు చెన్నైలోని తిరువాన్మయూర్ లోని ఎల్ బీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. జయశ్రీ ప్రముఖ నృత్య దర్శకురాలు. ఈశ్వర్ రఘునాథన్, జయశ్రీ దంపతుల కాపురం సజవుగానే సాగింది. అయితే ఇటీవల ఈశ్వర్ రఘునాథన్, జయశ్రీల మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో చిన్నచిన్న తగాదాలు జరిగేవని తెలిసింది.

భార్య ఆస్తులు కుదవ పెట్టిన నటుడు

భార్య ఆస్తులు కుదవ పెట్టిన నటుడు

కొంత కాలం క్రితం ఈశ్వర్ రఘునాథన్ అతని భార్య ఆస్తుల పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. తరువాత తన అనుమతి లేకుండా తన ఆస్తుల పత్రాలు ఎందుకు తీసుకెళ్లావు ? అంటూ జయశ్రీ భర్త ఈశ్వర్ రఘునాథన్ ను ప్రశ్నించిందని తెలిసింది.

భార్యను చితకబాదిన నటుడు

భార్యను చితకబాదిన నటుడు

గత శనివారం ఆస్తి పత్రాల విషయంలో ఈశ్వర్ రఘునాథన్, జయశ్రీల మద్య మాటామాటా పెరిగింది. వాగ్వివాదం పెద్దది కావడంతో సహనం కోల్పోయిన ఈశ్వర్ రఘునాథన్ భార్య జయశ్రీని పట్టుకుని చితకబాదాడని తెలిసింది. ఆ సమయంలో ఈశ్వర్ రఘనాథన్ కు అతని తల్లి అడ్డురాకుండా కొడుకుకే వత్తాసు పలికిందని, జయశ్రీ మీద దాడి చేయించిందని సమాచారం.

ఆసుపత్రిలో భార్య

ఆసుపత్రిలో భార్య

భర్త ఈశ్వర్ రఘునాథన్ దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన జయశ్రీ చెన్నైలోని అడయార్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆదివారం చికిత్స పొందిన జయశ్రీ తరువాత అడయార్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నలుడు ఈశ్వర్ రఘునాథన్, అతని తల్లిని అరెస్టు చేసి జైలుకు పంపించి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ప్రసిద్ది చెందిన బుల్లితెర నటుడు ఈశ్వర్ రఘునాథ్ భార్య జయశ్రీ మీద దాడి చేశాడని వెలుగు చూడటంతో తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాఫిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+