తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షుడు కె ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఆరుగురు దుండుగులు హత్య చేశారు. చెన్నై పెరంబూర్‌లోని సదయప్పన్ స్ట్రీట్‌లోని ఆయన ఇంటి దగ్గర, బైక్‌లపై వచ్చిన దుండుగులు ఆర్మ్ స్ట్రాంగ్‌ను కిరాతకంగా నరికి చంపారు.
అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్ స్ట్రాంగ్‌ను థౌజండ్ లైట్స్ అపోలో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతిచెందారు. అయితే ఆర్మ్ స్ట్రాంగ్ తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హత్య విషయం తెలిసిన తర్వాత అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్మ్ స్ట్రాంగ్ మృతదేహాన్ని చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కే ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు గురికావడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విచారకరమని, హత్యను ఖండించారు. వృత్తిరీత్యా న్యాయవాది, రాష్ట్రంలో బలమైన దళితవాణిగా పేరు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులను శిక్షించాలి అని మాయావతి డిమాండ్ చేశారు.
#WATCH | Tamil Nadu: Visuals from outside Rajiv Gandhi General Hospital in Chennai, where the body of Bahujan Samaj Party (BSP) Tamil Nadu president Armstrong has been brought.
— ANI (@ANI) July 5, 2024
He was hacked to death by an unidentified mob of 6 people near his residence in Perambur, Chennai… pic.twitter.com/UxNGJArg6W
మరోవైపు, ఆర్మ్ స్ట్రాంగ్ హత్య ఘటనపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా స్పందించారు. మృతుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హింస, క్రూరత్వానికి మన సమాజంలో స్థానం లేదన్నారు. కానీ, గత 3 ఏళ్లలో డీఎంకే పాలనలో తమిళనాడులో అది ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కు నైతిక ఉందా? అని తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. స్టాలిన్ కు సీఎంగా కొనసాగే అర్హత ఉందా? అని నిలదీశారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలంటూ పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
226 స్థానాల్లో విజయం మాదే: మమతా బెనర్జీ సంచలనం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
బాలినేని స్థానం ప్రకాశంలో ఆయనకే, తేల్చి చెప్పిన జగన్ - ఇక నుంచి..!! -
వివేకా గుండెపోటు ప్లాన్ సునీతదే ! అవినాష్ రెడ్డి సంచలనం..! -
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
Vijayasai Reddy: కొత్త లుక్ లో విజయసాయిరెడ్డి -పొలం పనుల్లో బిజీగా..! -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Putta Mahesh Video: పుట్టా మహేష్ వీడియో వీడియో రిలీజ్-ఏం జరిగిందంటే? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్!












Click it and Unblock the Notifications